Nepal Gen-Z Protest : నేపాల్‌లో మళ్లీ జన్-జడ్ ఆందోళనలు

నేపాల్‌లో జెన్‌-జడ్‌ నిరసనలు మళ్లీ ప్రబలడంతో బారా జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తించాయి. రెండు గ్రూపుల ఘర్షణలతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Nepal Gen-Z Protest : నేపాల్‌లో మళ్లీ జన్-జడ్ ఆందోళనలు

న్యూఢిల్లీ : నేపాల్ లో మరోసారి జన్-జడ్ ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు, యువ నిరసనకారుల మధ్య ఘర్షణల కొనసాగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. బారా జిల్లాలో కర్ఫ్యూ విధించింది. ఎక్కువ మంది ఒకే చోట ఉండడంపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. బారా జిల్లాలో బుధవారం జెన్‌-జడ్‌ నిరసనకారులు, ఓలీ మద్దతుదారులు ర్యాలీలు నిర్వహించారు. కొద్దిసేపటికే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అప్రమత్తమై కర్ఫ్యూ విధించారు. శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు భద్రతా బలగాలు సన్నద్ధతతో ఉండాలని నేపాల్‌ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ ఆదేశించారు. రాజకీయంగా రెచ్చగొట్టే సమాచారానికి ప్రజలంతా దూరంగా ఉండాలని, ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకం కొనసాగించాలని కోరారు.

రెండు నెలల క్రితం నేపాల్‌లో జనరేషన్‌-జడ్‌ నిరసనలు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలైన అల్లర్లు…అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారిలు హింసాత్మక రూపం దాల్చాచి. యువతరం ఆందోళనల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ క్రమంలోనే తాత్కాలిక ప్రధానిగా సుశీల నియమితులయ్యారు. 2026 మార్చి 5న ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే దిశగా తాము పనిచేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.