Gen Z Employee’s Honest Leave Email : “సార్ బ్రేకప్ అయింది.. లీవ్ కావాలి”.. వైరల్‌గా మారిన ఉద్యోగి మెయిల్
లవ్ బ్రేకప్ అయిందని లీవ్ కావాలంటూ బాస్‌కి మెయిల్ చేసిన ఉద్యోగి.. ఆ మెయిల్ చూసిన సీఈఓ రియాక్షన్ వైరల్‌గా మారింది!
విధాత : సెలవు కోసం ఉద్యోగులు చెప్పే కారణాలు ఒక్కోసారి వింతగా ఉండటం చూస్తుంటాం. అలాంటి ఘటనే హర్యానాలోని గుర్ గావ్ లో చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి తన సెలవు కోసం చెప్పిన కారణం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనకు లవ్ బ్రేకప్ అయిందని.. అందుకే లీవ్ కావాలంటూ నాట్ డేటింగ్ సీఈఓకి ఓ ఉద్యోగి మెయిల్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన మెయిల్ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఈఓ జస్వీర్ సింగ్ మెయిల్ స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
మెయిల్‌లో ఆ ఉద్యోగి తనకు బ్రేకప్ అయ్యిందని.. ఆ బాధలో పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని పేర్కొన్నాడు. బాధలో నుంచి కోలుకోవడానికి తనకు కొన్ని రోజుల పాటు విరామం కావాలని తెలిపాడు. అందుకుగాను లీవ్ ఇవ్వాలంటూ అభ్యర్థించాడు. ఈ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నాట్ డేటింగ్ సంస్థ సీఈఓ తన వృత్తి జీవితంలో ఇది తనకు అందిన అత్యంత నిజాయితీ గల సెలవు దరఖాస్తుగా పేర్కొన్నారు. తనకు మెయిల్ అందిన వెంటనే ఆ ఉద్యోగికి లీవ్ మంజూరు చేసినట్లుగా తెలిపారు. జెన్ జెడ్ తన మనసులో ఏమీ దాచుకోదని.. యువ ఉద్యోగులు తమ భావోద్వేగాలు, మానసిక సమస్యలు వంటి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram