Gen Z Post Office | యువత కోసం కర్ణాటకలో జెన్ జీ పోస్టాఫీస్..
పోస్టాఫీసు సంగతే యువత మర్చిపోయిన ఈ రోజుల్లో మళ్లీ దాని మాధుర్యాన్ని తెలియజేసేందుకు, యువతను పోస్టాఫీస్‌కు ఆకర్షించేందుకు పోస్టల్ శాఖ వినూత్న ప్రయోగం చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో ప్రారంభించిన తరహాలో బెంగళూరులో సైతం జెన్ జీ కెఫె స్టైల్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది.
Gen Z Post Office | అది చూడటానికి కెఫె స్టాల్‌లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళితే మీరు ఆశ్చర్యపోయేలా.. అక్కడ పోస్టాఫీస్ వ్యవస్థ కనిపిస్తుంది. యువతను ఆకట్టుకునేందుకు పోస్టల్ శాఖ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రయత్నం చేసింది. జెన్ జీ పోస్టాఫీసుగా చెబుతున్న దీనిని ఆచార్య ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో ప్రారంభించారు. విశేషం ఏమిటంటే.. ఈ పోస్టాఫీస్ డిజైన్‌ను ఆ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులే రూపొందించారు. వేడి వేడి కాఫీతో పాటు ఫ్రీ వైఫై సౌకర్యం, ఆటలాడుకునే విధంగా క్రీడా సామగ్రిని అందుబాటులో పెట్టారు.
అచిత్ నగర్ సొలదేవనహళ్లి, హెసరగట్ట రోడ్డు ఎదురుగా ఆచార్య ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోనీ ఈ జెన్ జీ పోస్టాఫీసు పలువురిని ఆకర్షిస్తున్నది. పోస్టాఫీసుకు వచ్చేవారు ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చు. పనిలో ఆలస్యమైన సందర్భంలో వేడి వేడి కాఫీ తాగవచ్చు. సమయం ఉంటే ఆటలు ఆడుకోవచ్చు. మైబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లో బ్యాటరీ చార్జ్ అయిపోతే చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ప్లగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వీటిలో దేనికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
విద్యార్థులను పోస్టల్ డిపార్ట్ మెంటుకు మరింత చేరువ చేసే విధంగా, సౌకర్యవంతంగా ఉండేలా, ఎక్కువ సమయం గడిపేలా జెన్ జీ పోస్టాఫీసును తీర్చిదిద్దారు. ఐదుగురు విద్యార్థులతో కూడిన ఆచార్య ఇన్‌స్టిట్యూట్ టీమ్ ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. ఇంటీరియర్ అండ్ స్సేషియల్ డిజైన్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ చేస్తున్న వీరు రెండు వారాల పాటు శ్రమించి డిజైన్ చేశారు. కర్ణాటక, బెంగళూరు సంప్రదాయం ఉట్టిపడేలా లోపల తీర్చిదిద్దారు. కెఫేలో స్వేచ్ఛగా కూర్చునేందుకు వీలుగా యువత కోసం కూర్చీలు, టేబుళ్లు డిజైన్ చేశారు. గత నెల ఢిల్లీ ఐఐటీలో మొదటి జెన్ జీ పోస్టాఫీసును ప్రారంభించారు. ఆ తరువాత ఐదు రాష్ట్రాలలో మరో ఐదింటిని ప్రారంభించారు కూడా. దేశంలోని 46 ప్రాంతాలలో పోస్టాఫీసులను జెన్ జీ తరహాలో తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read Also |
AP Universities Act amendment | ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు.. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు
Health Tips | చలికాలంలో ఉప్పు అతిగా తింటున్నారా..? గుండెపోటు తప్పదు మరి..!
MLA Ram Kadam | నీటి కొరతకు శాశ్వత పరిష్కారం.. నాలుగేండ్ల తర్వాత జుట్టు కత్తిరించుకున్న ఎమ్మెల్యే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram