• Telugu News
  • /National

Taj Mahal | మ‌రో షాజ‌హాన్‌.. భార్య కోసం తాజ్‌మ‌హ‌ల్ లాంటి ఇంటిని నిర్మించిన భ‌ర్త‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

తాజ్‌మహల్ (Taj Mahal).. ప్రేమకు ప్రతిరూపం. భార్య ముంతాజ్‌పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ (Shah Jahan) ఈ అంద‌మైన పాల‌రాతి క‌ట్ట‌డాన్ని నిర్మించారు. తాజాగా ఓ వ్య‌క్తి కూడా తాజ్ మ‌హ‌ల్ లాంటి ఇంటిని (Taj Mahal Replica) నిర్మించి త‌న భార్య‌పై ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 11, 2026, 2:15 pm IST
Read Time: 6 mins
Taj Mahal | మ‌రో షాజ‌హాన్‌.. భార్య కోసం తాజ్‌మ‌హ‌ల్ లాంటి ఇంటిని నిర్మించిన భ‌ర్త‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

Taj Mahal Replica | తాజ్‌మహల్ (Taj Mahal).. ప్రేమకు ప్రతిరూపం. భార్య ముంతాజ్‌పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ (Shah Jahan) ఈ అంద‌మైన పాల‌రాతి క‌ట్ట‌డాన్ని నిర్మించారు. ఆగ్రాలో ఉన్న ఈ తాజ్‌మ‌హ‌ల్‌.. ప్రంపంచ‌లోని ఏడు వింత‌ల్లో ఒక‌టిగా నిలిచింది. ఉత్త‌ర భార‌త సంద‌ర్శ‌న‌కు వెళ్లే దేశీ, విదేశీ ప‌ర్యాట‌కులు తాజ్ మ‌హ‌ల్‌ను సంద‌ర్శించ‌కుండా ఉండ‌లేరు.

ప‌లువురు దేశాధినేత‌లు సైతం ఇండియా ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు మ‌స్ట్‌గా ఈ తాజ్‌మ‌హ‌ల్‌ను విజిట్ చేస్తారు. అక్క‌డ కుటుంబంతో క‌లిసి ఫొటోలు తీసుకుని వాటిని గుర్తుగా దాచుకుంటారు. ఇది చాలా మందికి ఫేవ‌రెట్ స్పాట్‌. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాన‌ని అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ.. తాజాగా ఓ వ్య‌క్తి కూడా తాజ్ మ‌హ‌ల్ లాంటి ఇంటిని (Taj Mahal Replica) నిర్మించి త‌న భార్య‌పై ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు.

తాజ్ మ‌హ‌ల్ అంటే ఇష్టం..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) బుర్హాన్‌పుర్ (Burhanpur)కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సేకి తాజ్ మ‌హ‌ల్ అంటే ఇష్టం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఫ్యామిలీతో తాజ్‌ను విజిట్ చేస్తుంటాడు. అలా అత‌డికి కూడా త‌న భార్యపై ఉన్న ప్రేమ‌తో అలాంటి నిర్మాణాన్ని చేప‌ట్టాల‌న్న కోరిక పుట్టింది. అలా 2021లో తాజ్‌మ‌హ‌ల్‌ను పోలిన ఇంటిని నిర్మించి త‌న భార్య‌పై ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు. ఈ ఇంటి నిర్మాణానికి అత‌డికి మూడేళ్లు ప‌ట్టింది మ‌రి.

భార్య‌కు అంకితం..

ఇప్పుడు ఇంటి నిర్మాణం పూర్తైన నాలుగేళ్ల‌కు ఆ క‌ట్ట‌డం విశేషాల‌ను ప్ర‌కాష్ చౌక్సే వివ‌రించారు. ఇది తాజ్‌మ‌హ‌ల్‌ను పోలిన నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు అని తెలిపారు. ఈ ఇంటిని మ‌క్రానా పాల‌రాయితో నిర్మించిన‌ట్లు తెలిపారు. ఇది అస‌లైన తాజ్ మ‌హ‌ల్ ప‌రిణామంలో దాదాపు మూడింత ఒక వంతు ఉంటుంద‌ని చెప్పారు. దీన్ని త‌న భార్య రిటైర్డ్ డాక్ట‌ర్ మంజూష‌కు అంకిత చేసిన‌ట్లు అత‌డు చెప్పుకొచ్చారు.

ఎన్నో స‌వాళ్లు..

ఈ ఇంటి నిర్మాణం అంత ఈజీగా పూర్తి కాలేద‌ని ప్ర‌కాష్ చెబుతున్నారు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాడంట‌. తాజ్‌మహల్‌ను పలుమార్లు చూసి బంగాల్, ఇండోర్ నగరాలకు చెందిన కళాకారుల సాయంతో ఇంటి లోపల డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఇంటి డోమ్ దాదాపు 29 అడుగ‌ల ఎత్తు ఉంటుంది. తాజ్‌మహల్‌లానే టవర్లు నిర్మించారు. ఫ్లోరింగ్ కోసం రాజస్థాన్‌ మక్రానాను వాడారు.

రాత్రి స‌మ‌యంలో మెరిసిపోతూ..

ఇంటి లోప‌ల ఓ పెద్ద హాల్‌, గ్రౌండ్ ఫ్లోర్‌లో రెండు, అప్‌స్టైర్‌లో రెండు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఓ లైబ్ర‌రీ, మెడిటేష‌న్ రూమ్‌, జిమ్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. వెంటిలేష‌న్ వ‌చ్చే విధంగా ఇంటి నిర్మాణం చేప‌ట్టారు. మ‌రో విశేషం ఏంటంటే తాజ్ మ‌హ‌ల్ లానే ఈ ఇల్లు కూడా రాత్రి స‌మ‌యంలో మెరిపోతూ ఆక‌ట్ట‌కుంటుంది. ఆ ఇంటి వెలుప‌ల కూడా తాజ్ మ‌హ‌ల్ ముందు ఉన్న‌ట్లు చిన్న గార్డెనింగ్ చేశారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన తాజ్‌మహల్‌ను ప్రేరణగా తీసుకుని.. ఆధునిక కాలంలో నిర్మించిన ఈ ఇల్లు ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Telangana IAS transfers| తెలంగాణలో 10మంది ఐఏఎస్ ల బదిలీ
Gold, Silver price today| బంగారం స్వల్ప తగ్గుదల..వెండి స్థిరం!

 

View this post on Instagram

 

A post shared by Priyam Saraswat (@priyamsaraswat)