Gold, Silver price today| బంగారం స్వల్ప తగ్గుదల..వెండి స్థిరం!

బంగారం, వెండి ధరలు బుధవారం పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.270తగ్గి..రూ.1,58,510వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.3,00000లక్షల వద్దనే కొనసాగుతుంది

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 11, 2026, 1:50 pm IST
Read Time: 2 mins
Gold, Silver price today| బంగారం స్వల్ప తగ్గుదల..వెండి స్థిరం!

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు బుధవారం పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.270తగ్గి..రూ.1,58,510వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.250తగ్గి.. రూ.1,45,300వద్ద కొనసాగుతుంది.

స్థిరంగా వెండి ధరలు

జనవరి నెలాఖరువరకు ఆల్ టైమ్ రికార్డు ధరలతో పైపైకి చేరిన వెండి ధరలు ఫిబ్రవరి నెలలో పతనాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.3,00000లక్షల వద్దనే కొనసాగుతుంది. మూడు రోజులుగా వెండి ధరలు అదే ధర వద్ద స్థిరంగా ఉండటం విశేషం.

భారత కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మెల్లగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే దేశీయంగా ఆరోగ్యకరమైన స్పాట్ కొనుగోళ్లు పెరగడం వల్ల MCXలో బంగారం, వెండి ధరలకు మద్దతు లభించిందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయని, వెండి ధరలు మరికొంత కాలం హెచ్చతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.