• Telugu News
  • /Telangana

Jagga Reddy protest at polling booth| సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హల్చల్ !

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతూ హల్చల్ చేశారు. దమ్ముంటే సీఐ నా ముందుకు రావాలంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 11, 2026, 4:02 pm IST
Read Time: 4 mins
Jagga Reddy protest at polling booth| సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హల్చల్ !

విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతూ హల్చల్ చేశారు. 34వ వార్డులో రిగ్గింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో రేగిన వాగ్వివాదంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్బంగా సీఐ శివకుమార్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిని గల్లా పట్టుకున్నారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్బంగా తోపులాట సాగింది. ఇతర పోలీసు అధికారులు జగ్గారెడ్డిని సముదాయించారు.

సీఐ శివకుమార్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ వాళ్లకు అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర ఉందంటూ జగ్గారెడ్డి విమర్శలతో విరుచుకపడ్డారు.  దమ్ముంటే సీఐ నా ముందుకు రావాలంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.  నేను పోలింగ్ బూత్ లోకి రాక 26ఏళ్లు అయ్యిందని.. ఇదేమైనా సినిమానా మా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా అంటూ జగ్గారెడ్డి  సీఐపై ఆగ్రహంతో ఊగిపోయారు.

అంతకుముందు రోజు జగ్గారెడ్డిపై మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో సదాశివ పేటలో కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఓ హోటల్ వద్ద పేదలు, వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచడం వివాదస్పదంగా మారడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.