Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు కౌంట్‌డౌన్ ప్రారంభం…సెలబ్రేషన్ మోడ్‌లో హరిష్ శంకర్, దేవిశ్రీ, చంద్రబోస్
Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2026 మార్చి నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ రెండో కలయికపై అభిమానుల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2026 మార్చి నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ రెండో కలయికపై అభిమానుల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది టీమ్.
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించిన రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగిన హై ఎనర్జీ సాంగ్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ పాటకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్, గేయరచయిత చంద్రబోస్ కలిసి దేవిశ్రీ ప్రసాద్‌ను ఎత్తుకున్న ఫోటో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ స్థాయిలో హిట్ అవుతుందనే సంకేతాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ చిత్రం పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనగా, రాబోయే రోజుల్లో ట్రైలర్, మరిన్ని సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి అప్‌డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూర్తి స్థాయి మాస్ ట్రీట్ ఇవ్వనుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram