Sushila Karki : నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుశీలా కర్కి
నేపాల్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా జెన్ జడ్ ఉద్యమకారులు ప్రతిపాదించారు. ఓలి రాజీనామా తర్వాత ఈ నిర్ణయం.

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుశీలా కర్కి పేరును జెన్ జడ్ ఉద్యమకారులు ప్రతిపాదించారు. నాలుగు గంటల పాటు వర్చువల్ గా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుశీలా కర్కిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమించేనందుకు ఉద్యమకారులు అంగీకరించారు. నేపాల్ ప్రధానమంత్రి పదవికి కె.పి. శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధాలున్న యువకులు ఎవరూ కూడా నాయకత్వ చర్చల్లో పాల్గొనకూడదని అంగీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేని కర్కిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎంపిక చేసేందుకు అంగీకరించారు. ఉద్యమకారుల నుంచి వచ్చిన ప్రతిపాదనకు కర్కి కూడా సానుకూలంగా ఉన్నారు. ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిన తనకు నిద్రపట్టలేదని కర్కి అన్నారు. కానీ, బయట ఏం జరుగుతుందో తనకు నిజంగా తెలియదని చెప్పారు. కానీ, హింసాత్మక ఘటనల్లో 19 మంది మరణించిన ఘటనపై ఆమె విషాదకరమైందని అన్నారు.
నేపాల్ లో సోషల్ మీడియాపై నిషేధానికి నిరసనగా ఆందోళన సాగింది. ఇది చివరకు మంత్రులు, చివరికి ప్రధాని ఓలి రాజీనామా చేసేవరకు వెళ్లింది. నేపాల్ రాజధాని ఖట్మాండ్ ను ను ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుంది. కర్ప్యూ కొనసాగుతోంది. మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ పార్లమెంట్ లో 2017 ఏప్రిల్ 30న ఆమెపై అభిశంసన తీర్మానాన్ని సమర్పించాయి. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ కొనసాగకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు.