మనిషి కడుపులో 62 స్పూన్లు.. షాకైన డాక్టర్లు
విధాత: ఆకలిగా ఉంటే ఆహారం తింటాం. లేదంటే జీర్ణం అయ్యే పదార్థాలను తినేస్తాం.. కానీ ఓ వ్యక్తి అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. మనం నిత్యం ఉపయోగించే స్పూన్లను మింగేశాడు. ఏదో ఒకట్రెండు స్పూన్లు కాదు.. ఏకంగా 62 స్పూన్లను మింగేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌కు చెందిన విజయ్(32 ) అనే వ్యక్తి కడుపునొప్పితో బాధ పడుతూ వైద్యులను సంప్రదించాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్యులు […]

విధాత: ఆకలిగా ఉంటే ఆహారం తింటాం. లేదంటే జీర్ణం అయ్యే పదార్థాలను తినేస్తాం.. కానీ ఓ వ్యక్తి అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. మనం నిత్యం ఉపయోగించే స్పూన్లను మింగేశాడు. ఏదో ఒకట్రెండు స్పూన్లు కాదు.. ఏకంగా 62 స్పూన్లను మింగేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌కు చెందిన విజయ్(32 ) అనే వ్యక్తి కడుపునొప్పితో బాధ పడుతూ వైద్యులను సంప్రదించాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్యులు షాక్‌కు గురయ్యారు. విజయ్ కడుపులో స్పూన్లను గుర్తించారు.
2 గంటల పాటు సర్జరీ నిర్వహించి, 62 స్పూన్లను తొలగించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో ఉన్నాడు. విజయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఏడాది కాలం నుంచి స్పూన్లను మింగేస్తున్నట్లు విజయ్ డాక్టర్లకు తెలిపాడు.