Maharashtra | ఆలయ ప్రాంగణంలో కూలిన భారీ వృక్షం.. ఏడుగురు భక్తులు మృతి
Maharashtra | మహారాష్ట్రలోని ఓ ఆలయ( Temple ) ప్రాంగణంలో భారీ ప్రమాదం జరిగింది. అకోలా జిల్లాలోని బాబూజీ మహారాజ్ ఆలయంలో ఉన్న వందేండ్ల నాటి వేప వృక్షం( Neem Tree ) కూలిపోవడంతో ఏడుగురు భక్తులు( Devotees ) మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో బాబూజీ మహారాజ్ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. మహా హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు […]

Maharashtra | మహారాష్ట్రలోని ఓ ఆలయ( Temple ) ప్రాంగణంలో భారీ ప్రమాదం జరిగింది. అకోలా జిల్లాలోని బాబూజీ మహారాజ్ ఆలయంలో ఉన్న వందేండ్ల నాటి వేప వృక్షం( Neem Tree ) కూలిపోవడంతో ఏడుగురు భక్తులు( Devotees ) మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో బాబూజీ మహారాజ్ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. మహా హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయంలోని 100 ఏండ్ల నాటి వేపచెట్టు దెబ్బతిన్నది. నిన్న రాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో ఆ చెట్టు రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో షెడ్డు కింద ఉన్న భక్తుల్లో ఏడుగురు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బుల్డోజర్ సాయంతో చెట్టును పక్కకు తొలగించారు. ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ 23 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఫడ్నవీస్ ప్రకటించారు.