మహారాష్ట్రలో మరో ఘోరం.. 8 మంది దుర్మరణం
మహారాష్ట్రలో రహదారులు నెత్తురోడాయి. పుణె జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను మరో వాహనం బలంగా ఢీకొట్టింది.

ముంబై : మహారాష్ట్రలో రహదారులు నెత్తురోడాయి. పుణె జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11:30 గంటలకు చోటు చేసుకుంది.
ఓ వాహనం అహ్మద్‌నగర్ నుంచి కల్యాణ్(థానే జిల్లా) కు బయల్దేరింది. ఓతూరు పోలీసు స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఆ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు, ఆ వాహనం డ్రైవర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక పుణె – నాసిక్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కారు -కార్గో ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది