INDIA | ముంబైలో ఇండియా భేటీకి అంతా సిద్ధం
26 విపక్ష పార్టీల నుంచి హాజరు కానున్న 80 మంది నేతలు, ఐదుగురు సీఎంలు INDIA | విధాత: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ నెలాఖరున జరిగే విపక్ష ఇండియా కూటమి సమావేశానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే భేటీకి 26 విపక్ష పార్టీల నుంచి 80 మంది నేతలు, ఐదుగురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో భేటీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని […]

- 26 విపక్ష పార్టీల నుంచి హాజరు కానున్న
- 80 మంది నేతలు, ఐదుగురు సీఎంలు
INDIA | విధాత: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ నెలాఖరున జరిగే విపక్ష ఇండియా కూటమి సమావేశానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే భేటీకి 26 విపక్ష పార్టీల నుంచి 80 మంది నేతలు, ఐదుగురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో భేటీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మహా వికాస్ అఘాడి (MVA) నాయకులు వెల్లడించారు.
భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సహా ఎంవీఏ సీనియర్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులతోపాటు బుధవారం గ్రాండ్ హయత్ హోటల్‌లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రతిపక్ష ఇండియా కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.