టీ-20: బ్లాక్ టిక్కెట్ల దందా.. రూ.850 టికెట్ 11 వేలకు

విధాత‌, క్రికెట్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మూడో టీ-20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు స‌మంగా గెలవగా.. ఈరోజు జరిగే మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది. ఇది డిసైడర్ మ్యాచ్ కావటంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనటం.. తొక్కిసలాట జరగటం.. ఇదంతా క్రికెట్ అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ఇదే అదునుగా చేసుకుని కొందరు బ్లాక్ […]

  • By: Somu    latest    Sep 25, 2022 12:44 PM IST
టీ-20: బ్లాక్ టిక్కెట్ల దందా.. రూ.850 టికెట్ 11 వేలకు

విధాత‌, క్రికెట్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మూడో టీ-20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు స‌మంగా గెలవగా.. ఈరోజు జరిగే మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది. ఇది డిసైడర్ మ్యాచ్ కావటంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే టికెట్ల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనటం.. తొక్కిసలాట జరగటం.. ఇదంతా క్రికెట్ అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ఇదే అదునుగా చేసుకుని కొందరు బ్లాక్ టికెట్‌గాళ్లు దందా మొదలుపెట్టారు.

ఇప్పటికే.. జింఖానా గ్రౌండ్ పరిసరాల్లో బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఉదయం 1500 రూపాయల టిక్కెట్లు బ్లాక్‌లో 6 వేలు పలకగా.. మ్యాచ్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. ధర ఓ రేంజ్‌లో పెంచేశారు. తాజాగా.. 850 రూపాయల విలువ గల టికెట్లను ఏకంగా 11 వేలకు అమ్ముతున్నారు బ్లాక్ టికెట్‌గాళ్లు.

ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న గుగులోత్ వెంకటేష్, ఇస్లావత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు యువకులను ఎల్బీనగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుల వద్ద నుండి 6 టిక్కెట్లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. ముగ్గురిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

అయితే.. మూడేళ్ల తరువాత హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో.. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వాహణ సరిగ్గాలేక.. టికెట్ల వ్యవహారం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ చెడ్డపేరు మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారికి.. అవి ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తొక్కిసలాట జరిగినా దొరకని టికెట్లు.. బ్లాక్‌లో అమ్మేవారికి ఎలా వచ్చాయని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.