Degree Exams | చున్నీపై కెమిస్ట్రీ సమాధానాలు.. పట్టుబడ్డ డిగ్రీ విద్యార్థిని..
Degree Exams | ఓ అమ్మాయి( Girl Student ) చాలా తెలివి ప్రదర్శించింది. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్( Semester Exams )లో పాస్ కావాలన్న లక్ష్యంతో కాపీ కొట్టింది. అదేదో పేపర్ మీద జవాబులు రాసుకెళ్లలేదు. మైక్రో జిరాక్స్ కూడా తీసుకెళ్లలేదు. ఎవరికీ అనుమానం రాకుండా తన చున్నీపై సమాధానాలు రాసుకుని పరీక్షకు హాజరైంది. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లేటప్పుడు కూడా అధికారులు అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఆ తర్వాత పరీక్ష రాస్తుండగా విద్యార్థిని పట్టుబడింది. ఈ […]
Degree Exams | ఓ అమ్మాయి( Girl Student ) చాలా తెలివి ప్రదర్శించింది. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్( Semester Exams )లో పాస్ కావాలన్న లక్ష్యంతో కాపీ కొట్టింది. అదేదో పేపర్ మీద జవాబులు రాసుకెళ్లలేదు. మైక్రో జిరాక్స్ కూడా తీసుకెళ్లలేదు. ఎవరికీ అనుమానం రాకుండా తన చున్నీపై సమాధానాలు రాసుకుని పరీక్షకు హాజరైంది. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లేటప్పుడు కూడా అధికారులు అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఆ తర్వాత పరీక్ష రాస్తుండగా విద్యార్థిని పట్టుబడింది. ఈ ఘటన అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ( Sree Krishna Devaraya University ) పరిధిలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ( SV Degree College ) లో వెలుగు చూసింది.
తాను రాసుకెళ్లిన జవాబులకు సంబంధించిన ప్రశ్నలు క్వశ్చన్ పేపర్( Question Paper )లో కనిపించే సరికి ఆ విద్యార్థిని తెగ సంతోషపడిపోయింది. ఇక పండుగే అనుకుంది. మొత్తం నాలుగు జవాబులు రాసుకెళ్లిన ఆమె.. చున్నీపై రాసిన సమాధానాలను దొంగచాటుగా చూస్తూ.. ఆన్షర్ షీట్( Answer Sheet )పై రాస్తుంది. ఆన్షర్ షీటులో ఉండాల్సిన జవాబులు.. చున్నీపై ఉన్నాయేంటి అని ఎగ్జామినర్‌కు డౌట్ వచ్చింది. మరో విద్యార్థి చేతిపై జవాబులు రాసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక వీరిద్దరి నుంచి ఆన్షర్ షీటు తీసుకుని బయటకు పంపించారు ఎగ్జామినర్. వీరిద్దరిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram