Aarogyasri | ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శుభవార్త.. వైద్య సేవల పరిమితి 5 లక్షలకు పెంపు
Aarogyasri విధాతః తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 2లక్షల నుండి 5లక్షలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారులకు కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులను అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను […]

Aarogyasri
విధాతః తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 2లక్షల నుండి 5లక్షలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారులకు కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులను అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
నిమ్స్ స్పెషల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. బయోమెట్రిక్ విధానంలో ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందుల రీత్యా ఫేస్ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆన్‌లైన్ పర్యవేక్షణతో మరింత నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అనుమతినిచ్చారు. కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు.
మూగ, చెవిటి పిల్లలకు హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను వరంగల్ ఎంజీ ఎంలోనూ అందుబాటులోకి తేవాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.