గుజరాత్ తీరాన సింహరాజు విలాసం.. నెటిజన్లు ఫిదా

విధాత : అడవికి రారాజు సింహం సముద్ర తీరాన తన దర్పాన్ని చాటుతూ గంభీర వదనంతో వచ్చిపోయే అలల సోయగాలను, సవ్వడాలను వీక్షిస్తున్న దృశ్యం ఇప్పుడు నెట్టింటా వైరల్‌గా మారింది. గుజరాత్ అరేబియా సముద్ర తీరంలో అలల మధ్య రాచ ఠివీతో గంభీరంగా నిలబడిన సింహరాజం చిత్రాన్ని ఇండియన్ ఫారెస్టు సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
నార్నియా చిత్రం నిజమైన వేళ.. గుజరాత్ తీరంలో అలలను అస్వాదిస్తున్న సింహం అన్న క్యాప్షన్‌తో ఆయన పోస్టు చేసిన ట్విట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. తన ట్విట్‌తో పాటు ఆసియా సింహాలు సముద్ర తీరాల్లో నివసించడంపై చేసిన ఓ పరిశోధనా పత్రాన్ని కూడా పర్వీన్ ట్వీట్‌లో పొందుపరిచారు.
అసియా సింహాలు నివాసముఉండే ప్రాంతానికి వెళ్లి కొందరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించారని ఆయన వెల్లడించారు. సముద్ర అలల మధ్య సింహరాజం దృశ్యం చాల అద్భుతంగా ఉందని, ప్రకృతికి మరింత శోభనిచ్చిందని నెటిజన్లు తమ అభిఫ్రాయాలను పోస్టు చేస్తున్నారు.