World Cup 2023| పిచ్‌పైకి దూసుకొచ్చిన ప్రేక్షకుడు.. కోహ్లీతో అలింగనం

వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత : అహ్మదాబాద్ మొతేరా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం కలకలం రేపింది. మ్యాచ్ 14వ ఓవర్ సాగుతున్న క్రమంలో స్టేడియం స్టాండ్స్ నుంచి ఓ వ్యక్తి మధ్యలో పిచ్‌పైకి దూసుకొచ్చి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అలింగనం చేసుకున్నాడు. అతడు “ప్లే పాలస్తీనా” అనే టీ షర్ట్‌ను ధరించడం గమనార్హం. గమనించిన స్టేడియం సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకొని బయటకు పంపించేశారు. ఈ ఘటనతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో ఆట ముందుకు సాగింది.