వివాహేతర సంబంధం: భర్త, అత్తను ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో దాచిపెట్టి పక్క రాష్ట్రంలో
Assam | ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్, నిక్కీ యాదవ్ హత్య కేసులు మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసోంలోని గువాహటికి చెందిన ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్న భర్త, అత్తను ఆమె ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తర్వాత శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిపెట్టి, అనంతరం పక్క రాష్ట్రంలో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. గువాహటికి చెందిన శంకరి డేకు కుమారుడు అమరేంద్ర డే ఉన్నాడు. […]

Assam | ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్, నిక్కీ యాదవ్ హత్య కేసులు మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసోంలోని గువాహటికి చెందిన ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్న భర్త, అత్తను ఆమె ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తర్వాత శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిపెట్టి, అనంతరం పక్క రాష్ట్రంలో పడేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గువాహటికి చెందిన శంకరి డేకు కుమారుడు అమరేంద్ర డే ఉన్నాడు. అమరేంద్రకు కొన్నేండ్ల క్రితం వందన కలీట అనే యువతితో వివాహమైంది. అయితే వందన తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త, అత్తకు తెలియడంతో.. వందనను నిలదీశారు. దీంతో ఆమె వారిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.
ఏడు నెలల క్రితమే హత్య
వందన తన ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి అమరేంద్ర, శంకరి హత్యలకు ప్లాన్ చేసింది. ఏడు నెలల క్రితం వారిద్దరిని చంపి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసింది. అనంతరం ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి పెట్టింది. కొద్ది రోజుల తర్వాత పాలిథీన్ కవర్లలో శరీర భాగాలను ఉంచింది. గువాహటికి 150 కిలోమీటర్ల దూరంలోని మేఘాలయలోని చిరపుంజి అటవీ ప్రాంతంలో శరీర భాగాలను విసిరేసింది.
ఏమి తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు
ఇక భర్త అమరేంద్ర, అత్త శంకరి అదృశ్యమైనట్లు వందన పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే కొద్ది రోజులకు అమరేంద్ర కజిన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వందన ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో వందనను పోలీసులు విచారించడంతో.. అమరేంద్ర, శంకరిని చంపినట్లు అంగీకరించింది. ఈ క్రమంలో భర్త, అత్త శరీర భాగాలను కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నా కూతురిని కాల్చి చంపండి : వందన తండ్రి
భర్త, అత్తను అతి కిరాతకంగా చంపిన తన కూతురు వందనను కాల్చి చంపండి అని ఆమె తండ్రి పోలీసులకు తెలిపాడు. అమరేంద్ర, శంకరిని చంపినట్లు నేరం రుజువైతే బహిరంగంగా కాల్చి చంపాలని కోరాడు. అలాంటి కూతురు తనకు వద్దని, ఆమెతో తనకెలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. భర్త అమరేంద్ర, అత్త శంకరి మంచిగానే ఉన్నారని తనతో ఫోన్‌లో చెప్పేదని, ఇన్నాళ్లు ఈ విషయాన్ని అంధకారంలో ఉంచిందని తండ్రి వాపోయాడు.