Aadhaar Update | ఆధార్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన UIDAI..! మరో మూడునెలలు ఉచితంగానే అప్‌డేట్‌..!

Aadhaar Update | ఆధార్‌ యూజర్లకు ఉడాయ్‌ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరోసారి పెంచింది. ప్రస్తుత గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగించింది. డిసెంబర్‌ 14వ తేదీ వరకు ఉచితంగానే యూజర్లు ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చని చెప్పింది. ఆధార్‌లో పుట్టిన తేదీ, పేర్లు, చిరునామా మారినా అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఆధార్‌లో ఏవైనా తప్పులు ఉంటే.. సరైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ […]

Aadhaar Update | ఆధార్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన UIDAI..! మరో మూడునెలలు ఉచితంగానే అప్‌డేట్‌..!

Aadhaar Update |

ఆధార్‌ యూజర్లకు ఉడాయ్‌ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరోసారి పెంచింది. ప్రస్తుత గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగించింది. డిసెంబర్‌ 14వ తేదీ వరకు ఉచితంగానే యూజర్లు ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చని చెప్పింది. ఆధార్‌లో పుట్టిన తేదీ, పేర్లు, చిరునామా మారినా అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది.

ఆధార్‌లో ఏవైనా తప్పులు ఉంటే.. సరైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. http://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లో ఉచితంగా ఆధార్‌ను ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే వీలున్నది. ఆధార్ నంబర్, లింక్‌డ్‌ మొబైల్ ఉంటే సరిపోతుంది.

పోర్టల్‌లోకి లాగిన్‌ ఓటీపీ ఎంటర్‌ చేసి కావాల్సిన వివరాలను మార్చుకోవచ్చు. అయితే, అందుకు సంబంధించిన పత్రాలను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో, ఆధార్‌ కేంద్రాలు, సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తే రూ.25 వరకు చెల్లించాల్సి రానున్నది.

ఆన్‌లైన్‌లో ఎలా అప్‌ చేసుకోవాలంటే..

http://myaadhaar.uidai.gov.in వైబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌లో లాగిన్‌ అవ్వాలి. మీ పేరు, జెండర్‌, పుట్టిన తేదీ తదితర వివరాలు ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అప్‌డేట్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న అడ్రస్‌ లేదంటే ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీని అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఆ నంబర్‌ను సేవ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.