Aadhar | ఆధార్‌ అప్‌డేట్‌తో మోసాలు..! యూజర్లకు UIDAI కీలక హెచ్చరికలు..!

Aadhar | ప్రస్తుత కాలంలో అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా, ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కార్డుల కావాలన్నా తప్పనిసరిగా ఆధార్‌ కావాల్సిందే. అయితే, క్రమంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌పై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నది. ఇటీవల కాలంలో ఆధార్‌ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారంతా తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు ఆధార్‌ కేంద్రాలకు వెళ్తుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో వివరాలు […]

Aadhar | ఆధార్‌ అప్‌డేట్‌తో మోసాలు..! యూజర్లకు UIDAI కీలక హెచ్చరికలు..!

Aadhar |

ప్రస్తుత కాలంలో అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా, ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కార్డుల కావాలన్నా తప్పనిసరిగా ఆధార్‌ కావాల్సిందే. అయితే, క్రమంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌పై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నది.

ఇటీవల కాలంలో ఆధార్‌ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారంతా తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు ఆధార్‌ కేంద్రాలకు వెళ్తుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌డేట్‌ చేసుకుంటున్నారు. ఇదే తడువు సైబర్‌ నేరగాళ్లు సైతం పెట్రేగిపోతున్నారు. ఆధార్‌ మాటున జనాలను బురిడీ కొట్టించే ప్రయత్నాలకు తెరలేపుతున్నారు.

ఈ క్రమంలో అప్రమత్తమైన UIDAI ఆధార్‌ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసేందుకు పత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్‌ చేయొద్దని UIDAI సూచించింది. ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు తప్పనిసరిగా గుర్తింపు రుజువు (POI) లేదంటే.. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను ఈ-మెయిల్‌ చేయాలని, వాట్సాప్‌ చేయాలని కోరడం లేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) స్పష్టం చేసింది.

ఎవరూ గుర్తింపుకార్డులు, ప్రూఫ్‌ పత్రాలను ఎవరికీ పంపొద్దని కోరింది. అయితే, ఎవరైనా మెస్సేజ్‌లు వచ్చాయంటే మోసపోయే అవకాశం ఉంటుందని UIDAI తెలిపింది. UIDAI ఎప్పటికీ ముఖ్యమైన డాక్యుమెంట్లను యూజర్ల నుంచి కోరదని తెలిపింది. my Aadhaar Portal ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చని, లేదంటే ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఇదిలా ఉండగా.. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెకాల్నజీ ఆధ్వర్యంలో నడిచే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI).. యూజర్లు ఆధార్‌కార్డుల ఫొటోలను ఏ సంస్థలకు ఇవ్వొద్దని, ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో దుర్వినియోగం అయ్యే సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంటుందని చెప్పింది. ఆధార్‌ నంబర్‌కు బదులుగా మస్క్‌ ఆధార్‌ను మాత్రమే లావాదేవీలకు ఇవ్వాలని సూచించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర ప్లాట్‌ఫారాలలోనూ ఆధార్‌ను ఉంచొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే.