Aadhar | ఆధార్‌లో పుట్టిన రోజు తప్పుగా పడిందా..? ఎలా మార్చుకోవాలో తెలుసా..?

Aadhar | ప్రస్తుత కాలంలో ప్రతి చిన్నపనికి సైతం ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఆర్థిక, ప్రభుత్వ పథకాలతో పాటు అనేక అంశాల్లో ఆధార్‌ కీలకంగా మారింది. దేశంలో నివసించే వారందరికీ ఆధార్‌ తప్పనిసరిగా మారింది. వివిధ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు సైతం ఆధార్‌నే వినియోగ్తిన్నారు. పుట్టిన పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ ఈ ఆధార్‌కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Aadhar | ఆధార్‌లో పుట్టిన రోజు తప్పుగా పడిందా..? ఎలా మార్చుకోవాలో తెలుసా..?

Aadhar | ప్రస్తుత కాలంలో ప్రతి చిన్నపనికి సైతం ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఆర్థిక, ప్రభుత్వ పథకాలతో పాటు అనేక అంశాల్లో ఆధార్‌ కీలకంగా మారింది. దేశంలో నివసించే వారందరికీ ఆధార్‌ తప్పనిసరిగా మారింది. వివిధ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు సైతం ఆధార్‌నే వినియోగ్తిన్నారు. పుట్టిన పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ ఈ ఆధార్‌కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిమ్‌కార్డు కొనుగోలు నుంచి బ్యాంకుల్లో ఖాతా తెరిసేందుకు సైతం ఈ కార్డు కావాల్సిందే. కీలకమైన కార్డులో తప్పులు దొర్లితే ఒకటి రెండుసార్లు మార్చుకునేందుకు వీలుకల్పిస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనుమతి ఇస్తున్నది. పేరు, అడ్రస్‌, పుట్టిన తేదీ, జెండర్‌ వివరాల్లో కొన్నింటికి ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. పుట్టిన తేదీకి సంబంధించిన తప్పులను సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. తగిన గుర్తింపు పత్రంతో డేటాఫ్ బర్త్‌ని సరి చేసుకోవచ్చు.

ఇందుకు పాన్‌కార్డ్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పదో తరగతి మార్కుల మెమోలో ఏదైనా ఒకదాన్ని సాక్ష్యంగా చూపించి.. తేదీని మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియను ఆధార్ సెంటర్‌లోనే చేసే వీలుంది. ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉడాయ్‌ ప్రత్యేంగా 1947 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎరైనా తప్పులను సరి చేసుకునేందుకు మొదట ఆధార్‌ కేంద్రానికి వెళ్లి కరెక్షన్‌ ఫామ్‌ తీసుకోవాలి. పుట్టిన తేదీ వివరాల్లో మార్పులను పేర్కొంటూ ప్రూఫ్ డాక్యుమెంట్ జతచేయాలి. రూ.50 చెల్లించి బయోమెట్రిక్‌ వివరాలు ఇస్తే సరిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్‌డేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అయిన ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఆధార్‌ కార్డ్‌ వినియోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉడాయ్‌ యూజర్లకు సూచిస్తున్నది. ఎక్కడ పడితే అక్కడ కార్డులను ఇవ్వకూడదని.. తప్పనిసరి పరిస్థితుల్లో మస్క్‌డ్‌ ఆధార్‌ ఇవ్వాలని సూచించింది. అయితే, పలువురు సైబర్‌ నేరగాళ్లు ఆధార్‌కార్డులను ఉపయోగించి మోసాలకు పాల్పడుతుండడంతో ఈ సూచనలు చేసింది.