Accident | త‌మిళ‌నాడులో ఘోర ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Accident విధాత‌: త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లాలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు అదుపుత‌ప్పి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 80 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అయితే ఓ బ‌స్సు టైర్ పేలిపోవ‌డంతో.. అదుపుత‌ప్పిన ఆ బ‌స్సు, ఎదురుగా వ‌స్తున్న మ‌రో బ‌స్సును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం […]

Accident | త‌మిళ‌నాడులో ఘోర ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Accident

విధాత‌: త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లాలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు అదుపుత‌ప్పి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 80 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

అయితే ఓ బ‌స్సు టైర్ పేలిపోవ‌డంతో.. అదుపుత‌ప్పిన ఆ బ‌స్సు, ఎదురుగా వ‌స్తున్న మ‌రో బ‌స్సును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు మృతి చెందారు. ఒక బ‌స్సేమో తిరువ‌న్న‌మ‌లై నుంచి మ‌రో బ‌స్సేమో ప‌నురుటి నుంచి వ‌స్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. పనురుటి నుంచి వ‌స్తున్న బ‌స్సు టైర్ పేల‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం క‌డ‌లూరు జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేల చొప్పున, స్వ‌ల్ప గాయాల‌తో బాధ‌ప‌డుతున్న వారికి రూ.25 వేలు ప‌రిహారం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.