అందాల ఓ చిలుకా.. కలువల్లాంటి కళ్లతో మెప్పించిన జమున
Actress Jamuna | మహానటి జమున పేరు వినగానే.. ఆ నాటి ఆమె అందం, అభినయం గుర్తుకు వస్తుంది. కలువల్లాంటి కళ్లతో కోటి భావాలు ప్రకటిస్తారమె. కనుబొమ్మలతోనే తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తారు. ఆ మహానటి నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఆనందిస్తుంటారు. 1966లో జమున, హరనాథ్ జంటగా నటించిన లేత మనసులు చిత్రంలోని అందాల ఓ చిలుకా సాంగ్‌ను ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కళ్లతో భావాలు పలికించిన తీరును చూసి.. ఆమె అభినయానికి ఫిదా […]

Actress Jamuna | మహానటి జమున పేరు వినగానే.. ఆ నాటి ఆమె అందం, అభినయం గుర్తుకు వస్తుంది. కలువల్లాంటి కళ్లతో కోటి భావాలు ప్రకటిస్తారమె. కనుబొమ్మలతోనే తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తారు. ఆ మహానటి నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఆనందిస్తుంటారు.
1966లో జమున, హరనాథ్ జంటగా నటించిన లేత మనసులు చిత్రంలోని అందాల ఓ చిలుకా సాంగ్‌ను ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కళ్లతో భావాలు పలికించిన తీరును చూసి.. ఆమె అభినయానికి ఫిదా అవుతున్నారు. ఆ పాటలో జమున నటించిన తీరు ప్రతి ప్రేమికుడిని మెప్పిస్తుంది. అంతే కాదు.. ఆ పాట విన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమ లేఖ రాయలన్న భావన కలుగుతుంది. అంతగా నటించారు జమున. అందాల చెలికాడా అందుకో నా లేఖ.. నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను అన్న లిరిక్స్ మహాద్భుతం. ఈ లిరిక్స్ ప్రతి ప్రేమికుడి గుండెలను హత్తుకున్నాయనడంలో సందేహం లేదు.
అందాల ఓ చిలుకా పాటను దాశరథి రాయగా, పీ సుశీల, పీబీ శ్రీనివాస్ ఆలపించారు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. లేత మనసులు మూవీ కృష్ణన్ – పంజు దర్శకత్వంలో తెరకెక్కింది.