Sreeleela: దూసుకొస్తున్న మరో బ్యూటీ.. శ్రీలీలకు కష్టమే ఇక

విధాత: ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఆగ్ర కథానాయికగా హవా కొనసాగిస్తోంది. మరోవైపు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdery) కూడా ఇటీవల చాలా సినిమాలలో నటిస్తూ శ్రీలల (Sreeleela)కు పోటీగా దూసుకు వస్తోంది.
ఇప్పుడు వీరిద్దరి చేతుల్లోనే చెరో అర డజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయంటే ఈ ముద్దుగుమ్మలు సందడి ఎలా ఉందో అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు వీరికి పోటీగా మరో అందాల తార రయ్ మంటూ వచ్చేస్తోంది.
ఇప్పటిఇకే ఓ నాలుగు సినిమాలలో నటిస్తోండగా భవిష్యత్‌లో టాలీవుడ్‌ను ఏలడమే కాకుండా శ్రీలీలకు అసలు సిసలు పోటీ అని పేరు తెచ్చుకోవడం గ్యారంటీ అనిపిస్తోంది.
ఆ చిన్నది మరెవరో కాదు.. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కల్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రితికనాయక్ (Ritika Nayak).
ఆ సినిమా తర్వాత నాని హాయ్ నాన్న సినమాలో చిన్న క్యారెక్టర్‌లో కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్‌లో ఉంది.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్, తేజ సజ్జాతో మిరాయ్ వంటి మంచి క్రేజీ సినిమాల్లో నటిస్తున్న ఈ చిన్నది తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొరియన్ కనకరాజు చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.
ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో వార్తలు మాత్రం బాగా ప్రచారం అవుతున్నాయి. మరోవైపు అందానికి అందం, నటన, గ్లామర్ ఫుల్‌గా ఉ్నన ఈ భామ శ్రీలీలకు పోటీ ఇస్తుందని అనుకుంటున్నారు.