హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌.. అదానీ గ్రూప్‌తో ఎల్‌ఐసీ అధికారుల భేటీ..!

Adani Hindenburg Row | త్వరలో అదానీ గ్రూప్‌ యాజమాన్యంతో భేటీకానున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ బయట పెట్టిన అనంతరం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్‌ఐసీ నిర్ణయంపై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌తో భేటీ కానున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్‌ తెలిపారు. […]

హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌.. అదానీ గ్రూప్‌తో ఎల్‌ఐసీ అధికారుల భేటీ..!

Adani Hindenburg Row | త్వరలో అదానీ గ్రూప్‌ యాజమాన్యంతో భేటీకానున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ బయట పెట్టిన అనంతరం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్‌ఐసీ నిర్ణయంపై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌తో భేటీ కానున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్‌ తెలిపారు. అలాగే అదానీ గ్రూప్‌ నుంచి కూడా సంస్థ వివరణ కోరింది.

అదానీ గ్రూప్‌ సంస్థ షేర్లలో భారీగా అక్రమాలకు పాల్పడుతుందని, అకౌంట్స్‌లో మోసాలకు పాల్పతుండడంతో పాటు ఆఫ్‌షోర్‌ షెల్‌ కంపెనీల నడుపుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత నుంచి అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు అధికార ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఐఎల్‌సీ, ఎస్‌బీఐ భారీ పెట్టుబడులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా రూ.20వేలకోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసుకుంటున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. ఇప్పటికే అదానీ గ్రూప్‌ షేర్లు దాదాపు 60శాతం పతనమయ్యాయి.