Addanki Dayakar | చేరికలు లేక.. ఈటల ఫ్రస్టేషన్‌ అవుతున్నారు: అద్దంకి

విధాత‌: రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు అవగాహన లేమి లేదా ఫ్రస్టేషన్‌ కావొచ్చని కాంగ్రెస్‌ పార్టీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar) అన్నారు. కాంగ్రెస్‌ బలపడటంతో బీజేపీలో భయం కనిపిస్తున్నదన్నారు. ఢాంబికాలు చెప్పుకుని ఈటల బీజేపీలో చేరారు. బీజేపీలో చేరికలు లేనందున ఈటల ఫ్రస్టేషన్‌ అవుతున్నారు. రూ. 18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్‌రెడ్డిని కొన్నారని అద్దంకి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సవాల్‌ను ఈటల రాజేందర్‌ స్వీకరించాలన్నారు. ఈటల.. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి. ఎంపీ […]

  • By: Somu |    latest |    Published on : Apr 22, 2023 1:30 AM IST
Addanki Dayakar | చేరికలు లేక.. ఈటల ఫ్రస్టేషన్‌ అవుతున్నారు: అద్దంకి

విధాత‌: రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు అవగాహన లేమి లేదా ఫ్రస్టేషన్‌ కావొచ్చని కాంగ్రెస్‌ పార్టీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar) అన్నారు. కాంగ్రెస్‌ బలపడటంతో బీజేపీలో భయం కనిపిస్తున్నదన్నారు.

ఢాంబికాలు చెప్పుకుని ఈటల బీజేపీలో చేరారు. బీజేపీలో చేరికలు లేనందున ఈటల ఫ్రస్టేషన్‌ అవుతున్నారు. రూ. 18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్‌రెడ్డిని కొన్నారని అద్దంకి ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి సవాల్‌ను ఈటల రాజేందర్‌ స్వీకరించాలన్నారు. ఈటల.. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని తెలిపారు.