ఏఈఈ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే!
విధాత: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఏఈఈ పరీక్ష గేట్ పరీక్ష ఉన్నందున మార్చి 5వ తేదీకి టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. 10న మహిళా, శిశు సంక్షేమ అధికారి పరీక్ష ప్రైమరీ కీ విడుదల అలాగే మహిళా, శిశు సంక్షేమ అధికారి నియామక పరీక్ష ప్రాథమిక కీ ఈ నెల 10న విడుదల కానున్నది. ఈ నెల 11 నుంచి 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు సర్వీస్ కమిషన్ […]
విధాత: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఏఈఈ పరీక్ష గేట్ పరీక్ష ఉన్నందున మార్చి 5వ తేదీకి టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.
10న మహిళా, శిశు సంక్షేమ అధికారి పరీక్ష ప్రైమరీ కీ విడుదల
అలాగే మహిళా, శిశు సంక్షేమ అధికారి నియామక పరీక్ష ప్రాథమిక కీ ఈ నెల 10న విడుదల కానున్నది. ఈ నెల 11 నుంచి 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాంటి ప్రకటనలు నమ్మొద్దు-టీఎస్‌పీఎస్‌సీ
ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని , ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకే జరుగుతుందని ప్రకటించింది. నియామక ప్రక్రియపై నకిలీ ప్రకటనలు నమ్మవద్దని సూచించింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram