Nalgonda: రైతు సమస్యలపై అఖిలపక్షం మహా ధర్నా.. స్పందించకపోతే ఆందోళన ఉదృతం: దుబ్బాక
విధాత: రైతాంగం సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ధర్నాలో పాల్గొన్న వివిధ పక్షాల నాయకులు, రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నరసింహ రెడ్డి (Dubbaka Narasimha Reddy) మాట్లాడుతూ ఒకవైపు రైతులు అకాల వర్షాలతో పంటలు […]

విధాత: రైతాంగం సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ధర్నాలో పాల్గొన్న వివిధ పక్షాల నాయకులు, రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నరసింహ రెడ్డి (Dubbaka Narasimha Reddy) మాట్లాడుతూ ఒకవైపు రైతులు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని, కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో దాన్యం నిలువలు నీటి పాలవుతూ నష్టపోతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా వారిని మరింత ఇబ్బందులు పాలు చేస్తుందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు.
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన రైతులకు 10వేల రూపాయల పరిహారం ప్రకటించి జాప్యం చేస్తున్నారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసగిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా రాజకీయం చేయడం తగదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి రైతులకు మద్దతు ధర అందించాలన్నారు.
రైతు రుణమాఫీ చేసి, పంట నష్టపరిహారం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేత పన్నాల గోపాల్ రెడ్డి, టిడిపి ఇన్చార్జి ఎల్వి యాదవ్, పార్టీల నాయకులు పర్వతాలు, దుడుకు లక్ష్మీనారాయణ, జెడ్పిటిసి లక్ష్మన్న, వైస్ ఎంపీపీ జిల్లెల పరమేష్, అల్లి సుభాష్, జాన్ రెడ్డి, సూరెడ్డి సరస్వతి, వెంకటరెడ్డి, గిరి చైతన్య, పనస శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు