Dattatreya | సామాజిక తెలంగాణకు అలయ్ బలయ్ వేదిక కావాలి : గవర్నర్ దత్తాత్రేయ

Dattatreya | విధాత: తెలంగాణ ఉద్యమంలో విభిన్న పార్టీలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలతో పనిచేసే నాయకులందరినీ ఒకటి చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం నేడు సామాజిక తెలంగాణ సాధనకు వేదిక కావాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. భువనగిరిలో జిట్టా బాలకృష్ణ రెడ్డి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున తాను రాజకీయాలు మాట్లాడలేనన్నారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలని […]

  • By: krs    latest    Jun 04, 2023 11:18 AM IST
Dattatreya | సామాజిక తెలంగాణకు అలయ్ బలయ్ వేదిక కావాలి : గవర్నర్ దత్తాత్రేయ

Dattatreya |

విధాత: తెలంగాణ ఉద్యమంలో విభిన్న పార్టీలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలతో పనిచేసే నాయకులందరినీ ఒకటి చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం నేడు సామాజిక తెలంగాణ సాధనకు వేదిక కావాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. భువనగిరిలో జిట్టా బాలకృష్ణ రెడ్డి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున తాను రాజకీయాలు మాట్లాడలేనన్నారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేదిగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నారు. విద్య అందరి జీవితాలు మారుస్తుందని బలహీన వర్గాలకు చెందిన తాను చూపునందుని నేను గవర్నర్ గా ఉన్నానన్నారు.

దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యా, వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం కోసం పోరాడాలని, అలాంటి పోరాటాల ద్వారా మరింత మెరుగైన తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. రాజకీయ వైరుద్యాలు ఉన్నప్పటికీ శత్రుత్వం ఉండరాదని అందుకు అలయ్ బలయ్ సహకరిస్తుందన్నారు.

1952 నుంచి బలిదానాలతో సాగిన తెలంగాణ ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిత మైందన్నారు. అమరుల స్తూపంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ నేడు యువకుల్లో నిరాశ ఉందన్నారు. వారికి ఉద్యోగాలు కావాలని, మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, మద్యపాన నియంత్రణ తో కూడిన స్వచ్ఛమైన తెలంగాణ కావాలని కోరుకుంటున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే బంగారమంతా స్వచ్ఛంగా ఉండాలన్నారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భీకర సమస్యగా ఉండేదని సామాజిక కార్యకర్త దుశర్ల సత్యనారాయణ పోరాటాన్ని ఆనాటి ప్రధాని వాజ్ పేయి దృష్టికి తాను తీసుకెళ్ళి నిధుల మంజూరుకు కృషి చేశానని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా అవతరించాలన్నారు.

రాజకీయ ఉద్యమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛభారత్ హరితహారం వంటి కార్యక్రమాలను కూడా కొనసాగించాలన్నారు. ప్రభుత్వంతోనే అన్ని పనులు జరగవని, ప్రజలు స్వచ్ఛంద కార్యక్రమాలతో సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. యువజన ప్రజా సమస్యల పైన ఆది నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి వివేకానంద స్ఫూర్తితో పని చేస్తున్నారన్నారని అభినందించారు.