Chamala Kiran Kumar Reddy : నూతన సర్పంచ్ లకు ఎంపీ చామల స్వీట్ బాక్స్ లు
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలోని 968 మంది నూతన సర్పంచ్‌లకు స్వీట్ బాక్సులు, గ్రీటింగ్ కార్డులు పంపి ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రికి కూడా స్వీట్లు పంపడం విశేషం.
విధాత : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని 968 గ్రామ పంచాయతీల్లో ఇటీవల గెలిచిన అన్ని పార్టీల సర్పంచులకు స్వీట్ బాక్స్, గ్రీటింగ్ కార్డులు పంపించడం చర్చనీయాంశమైంది. ఇటీవల నాగారం గ్రామ సర్పంచ్ గా గెలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికి కూడా ఎంపీ చామల స్వీట్ బాక్స్, గ్రీటింగ్ కార్డు పంపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పార్టీలకు అతీతంగా ఎంపీ చామల నూతన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమం సర్పంచ్ లను సైతం ఆకట్టుకుంది. గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం.. పారదర్శక పాలనలో నూతన సర్పంచ్ లు ఆదర్శంగా నిలవాలని ఎంపీ చామల తన గ్రీటింగ్ కార్డు సందేశంలో ఆకాంక్షించారు. మీ నాయకత్వంలో గ్రామపంచాయతీ సర్వతోముఖాభివృద్ది సాధించాలని కోరుకుంటున్నానని, మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానని.. మీకు, మీ గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Tummala Nageswara Rao : మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా..సీరియస్ వార్నింగ్
CP Sajjanar : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram