Musi River । సినిమా యాక్టర్లను మించి పోయిన బావా బామ్మర్దులు : భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మూసీలో 28 వేల కట్టడాలు అక్రమంగా ఉన్నాయని, వాటిని కూల్చివేయాలి చెప్పిన విషయాన్ని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. మీడియాతో పాటు ప్రజలు సహకరించాలని కూడా చెప్పారని అన్నారు. వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

Musi River । జిల్లాను సర్వ నాశనం చేసిన బీఆరెస్ నేతలు మాజీ మంత్రి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ చిరుమర్తి లింగయ్యలను నల్లగొండ జిల్లాలో తిరిగకుండా చెట్లకు కట్టేయాలని భువనగిరి ఎంపీ చామల కిరన్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలలో మీరు పీకలేనిది 10 నెలలలో మేం పీకాల్నా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు అగ్గిపెట్టె పట్టుకొని తిరుగుతున్నాడని, ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హరీష్ రావును నమ్ముకుంటే గతంలో శ్రీకాంత్ చారి లాగా బలైపోతారని హెచ్చరించారు. హరీష్ రావు చిల్లర మాటలు నమ్మకూడదన్నారు. బావా బామ్మర్దులు ఇద్దరూ సినిమా యాక్టర్లను మించిపోయారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం బీఆరెస్ నాయకులకు పరిపాటి అయిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మూసీలో 28 వేల కట్టడాలు అక్రమంగా ఉన్నాయని, వాటిని కూల్చివేయాలి చెప్పిన విషయాన్ని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. మీడియాతో పాటు ప్రజలు సహకరించాలని కూడా చెప్పారని అన్నారు. వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ద్విపాత్రాభినయం పోషిస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం చీమ్ముతున్నాయని ఆరోపించారు. క్షీర సాగర మథనంలో మొదట విషమే వస్తది, తర్వాత అమృతం వస్తది కొద్దిసేపు ఆగాలన్నారు.
మూసీ పైకి ఆహ్లాదం, లోపల కాలకూట విషంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలు, స్వార్ధ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తుండడంతో నేడు కాలుష్య కాసారమై దేశంలోనే అత్యంత ప్రమాదకర నదుల సరసన చేరిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కసు తో బిఆర్ఎస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ గుండాలు చేసిన కబ్జాలతోనే నేడు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తుదన్నారు. హైదరాబాద్ నగర మంచి కోసమే హైడ్రా అని చామల కిరణ్ తెలిపారు. భావితరాలకు హైదరాబాదును మంచి నగరంగా చూపెట్టాలంటే త్యాగం చేయక తప్పదన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకునే బాధ్యత మన పైన ఉందన్నారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమానికి ప్రతిపక్షాలు ప్రజలకు అండగా ఉండాలి కానీ దీనికి విరుద్దంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.