Amarnath Yatra 2023 | అమర్‌నాథ్ యాత్ర.. తాత్కాలికంగా నిలిపివేత
Amarnath Yatra 2023 ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం విధాత: ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. @యాత్రను రద్దు చేశాము. ఈ ఉదయం నుంచి యాత్రికులు ఎవరినీ మంచు లింగం వైపు పవిత్ర ప్రాంతానికి వెళ్లనివ్వడం లేదు* అని అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా బల్తాల్ , పహల్గామ్ మార్గాల్లో […]
Amarnath Yatra 2023
- ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం
విధాత: ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. @యాత్రను రద్దు చేశాము. ఈ ఉదయం నుంచి యాత్రికులు ఎవరినీ మంచు లింగం వైపు పవిత్ర ప్రాంతానికి వెళ్లనివ్వడం లేదు* అని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా బల్తాల్ , పహల్గామ్ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చిందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారితే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
7,010 మంది యాత్రికుల ఎనిమిదో బ్యాచ్ శుక్రవారం 247 వాహనాల కాన్వాయ్ పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల బయలుదేరాల్సి ఉన్నది. కానీ, యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. గురువారం నాడు 17,202 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram