Ambati Rayudu | జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు.. జనసేనాని అధికారిక ప్రకటన
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. వైసీపీ పథకాలను ప్రశంసిస్తూ.. ఆ పార్టీ నేతలకు అంబటి దగ్గరయ్యారు. గత ఐపీఎల్‌లో ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అంబటి రాయుడు..
ఆ తర్వాత వైసీపీతో సన్నిహితంగా మెలిగారు.
గుంటురూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. ఆ తర్వాత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆడుదాం ఆంధ్రాలో ఫుల్ యాక్టివ్‌గా వ్యవహరించారు. గుంటూరు ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతానికి ప్లేస్ ఖాళీగా లేదు.. కొన్ని రోజులు బెంచ్ మీద ఉండి సేవ చేయాల్సిందే అనేలా పార్టీలో సంకేతాలు వచ్చాయి. దీంతో లాభం లేదు అనుకున్న అంబటి.. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
జనసేన అధినేత పవన్‌తో భేటీ అవ్వడం ఆసక్తి రేపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచనల మేరకే పవన్‌తో భేటీ అయినట్లు అంబటి తెలిపారు. ఆ తర్వాత తన వ్యక్తిగత పనులు, క్రికెట్‌తో బిజీ అయిన అంబటి. మార్చి 27 వ తేదీన సిద్ధం అంటూ అంబటి ఓ ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ ఆయన వైసీపీ పంచనే చేరనున్నారా అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇంతవరకు ఏ విషయం చెప్పని అంబటి రాయుడు తాజాగా మరో ట్వీట్ వేసి దానికి గుట్టు విప్పాడు చెప్పాడు. సిద్ధం అని తాను చెప్పింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడానికి సిద్ధం.. అందుకు కలిసి నడుద్దాం అంటూ తాజాగా ట్వీట్‌లో పేర్కొన్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram