Amritpal Singh | సన్‌గ్లాసులు.. డెనిమ్‌ జాకెట్‌తో అమృత్‌పాల్‌ కొత్త వేషం

ఢిల్లీ సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు Amritpal Singh । నేపాల్‌లో తలదాచుకున్నాడని అనుమానిస్తున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌.. మార్చి 21వ తేదీన ఢిల్లీ వీధుల్లో కనిపించాడు. కళ్లకు సన్‌గ్లాసులు.. డెనిమ్‌ జాకెట్‌తో తలపాగా లేకుండా తిరుగుతుండటం సీసీటీవీలో రికార్డయింది. ఆయన పక్కనే అతడి మెంటార్‌గా చెప్పే పపల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. విధాత : అనుకున్నట్టే పంజాబ్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ మారువేషాల్లో తిరుగుతున్నాడు. పంజాబ్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులు నగరం నలుమూలల […]

  • By: Somu    latest    Mar 28, 2023 11:55 AM IST
Amritpal Singh | సన్‌గ్లాసులు.. డెనిమ్‌ జాకెట్‌తో అమృత్‌పాల్‌ కొత్త వేషం
  • ఢిల్లీ సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు

Amritpal Singh । నేపాల్‌లో తలదాచుకున్నాడని అనుమానిస్తున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌.. మార్చి 21వ తేదీన ఢిల్లీ వీధుల్లో కనిపించాడు. కళ్లకు సన్‌గ్లాసులు.. డెనిమ్‌ జాకెట్‌తో తలపాగా లేకుండా తిరుగుతుండటం సీసీటీవీలో రికార్డయింది. ఆయన పక్కనే అతడి మెంటార్‌గా చెప్పే పపల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు.

విధాత : అనుకున్నట్టే పంజాబ్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ మారువేషాల్లో తిరుగుతున్నాడు. పంజాబ్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులు నగరం నలుమూలల సీసీటీవీ ఫుటేజీలను గమనించగా.. మార్చి 21వ తేదీన ఒక ప్రాంతంలో డెనిమ్‌ జాకెట్‌ వేసుకుని, కళ్లకు సన్‌గ్లాసులు పెట్టుకుని, తల పాగా తీసేసి.. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్‌ వేసుకుని తిరుగుతుండటం రికార్డయింది. అతని వెంటనే అతడి సహచరుడు పపల్‌ప్రీత్‌సింగ్‌ కూడా ఉన్నాడు. మార్చి 18న అతడిని పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్‌ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

హర్యానాలోని కురుక్షేత్ర (Kurukshetra) మీదుగా వీరిద్దరూ ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడా ? లేక దేశ రాజధానిని వదిలి పారిపోయాడా? అన్న విషయంలో స్థానిక పోలీసులు ఏమీ చెప్పలేకపోతున్నారు. అయితే.. అతడు నేపాల్‌కు పారిపోయాడని తెలుస్తున్నది. ఇప్పటికే భారతదేశ అధికారులు నేపాల్‌ అధికారులతో సంప్రదించి, అమృత్‌పాల్‌సింగ్‌పై ఒక కన్నేసి ఉంచారని సమాచారం.

పంజాబ్‌ నుంచి పారిపోయింది మొదలు.. అమృత్‌పాల్‌, పపల్‌ప్రీత్‌లు పలు చోట్ల సీసీటీవీలో కనిపించారు. రాష్ట్రం నుంచి అతడు ఎలా పారిపోయాడు.. ఏయే మార్గాల్లో అతడి కదలికలు ఉన్నాయి అనే అంశాలను నిఘా వర్గాల సమాచారంతోపాటు.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గమనిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అమృత్‌పాల్‌, పపల్‌ప్రీత్‌లు ఒక ఎనర్జీ డ్రింక్‌ తాగుతూ ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అది పోలీస్‌ ఆపరేషన్‌ మొదలైన రెండో రోజునాటిదని చెప్తున్నారు