London | లండన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి. విషప్రయోగమే కారణం!
లండన్: ఖలిస్థానీ ఉగ్రవాది, అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు అవ్‌తార్ సింగ్ ఖండా గురువారం మృతి చెందాడు. లండన్ (London)లో అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించే అవ్‌తార్.. యూకే (UK) కేంద్రంగా ఉన్న ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ ఎఫ్)కు చీఫ్‌గానూ ఉన్నాడు. వైద్య నివేదికలో అతడు కేన్సర్‌తో చనిపోయాడని ఉన్నా.. విషప్రయోగం జరగడం వల్లే తమ నాయకుడు ప్రాణాలు కోల్పోయాడని అవ్‌తార్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఎవరీ అవ్‌తార్.. బాంబుల తయారీలో నిపుణుడైన అవ్‌తార్ సింగ్ ఖండా.. […]

లండన్: ఖలిస్థానీ ఉగ్రవాది, అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు అవ్‌తార్ సింగ్ ఖండా గురువారం మృతి చెందాడు. లండన్ (London)లో అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించే అవ్‌తార్.. యూకే (UK) కేంద్రంగా ఉన్న ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ ఎఫ్)కు చీఫ్‌గానూ ఉన్నాడు. వైద్య నివేదికలో అతడు కేన్సర్‌తో చనిపోయాడని ఉన్నా.. విషప్రయోగం జరగడం వల్లే తమ నాయకుడు ప్రాణాలు కోల్పోయాడని అవ్‌తార్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఎవరీ అవ్‌తార్..
బాంబుల తయారీలో నిపుణుడైన అవ్‌తార్ సింగ్ ఖండా.. మార్చి 19న యూకే హైకమిషన్ పైన ఎగురుతున్న భారతీయ జెండాను దించేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ ఘటన వెనుక ఖండాతో పాటు మరో ముగ్గురు ఉన్నారని ఎన్ ఐ ఏ కేసు సైతం నమోదు చేసింది. స్టడీ వీసాతో 2007లో లండన్ చేరుకున్న అవ్‌తార్.. 2012లో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నాడు.
అనంతరం యూకేలోని ఖలిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే గురుద్వారా (Gurudwara)లతో సంబంధాలు ఏర్పరచుకుని ఖలిస్థాన్ వేర్పాటు వాదానికి నిధులు సమీకరించేవాడు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో యువతను ఉగ్రవాదం (Terrorism) వైపు మళ్లించాడని నిఘా సంస్థలు వెల్లడించాయి.
వారిస్ పంజాబ్ డే కు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను అధినేతగా చేయడంలోనూ ఇతను ప్రముఖ పాత్ర పోషించాడని చెబుతారు. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టయిన అమృత్‌పాల్.. అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు.