London | లండ‌న్‌లో భారతీయుడికి క‌త్తిపోటు.. మృతి

London | లండ‌న్‌లో క‌త్తిపోటుకు గురై హైద‌రాబాద్ య‌వ‌తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. శుక్ర‌వారం అక్క‌డ‌ చోటు చేసుకున్న మ‌రో క‌త్తిపోటు ఘ‌ట‌నలో భార‌త సంత‌తి వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌతాంప్ట‌న్ వేలో ఉన్న ఒక నివాస స‌ముదాయంలో ఒక వ్య‌క్తి క‌త్తిపోట్ల‌కు గురై ప‌డి ఉన్న‌ట్లు ఫిర్యాదు రావ‌డంతో పోలీసుల‌కు అక్క‌డ‌కి చేరుకున్నారు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేయ‌గా.. అత‌డి పేరు అర‌వింద్ శ‌శి కుమార్ (38) అని గుర్తించారు. అయితే […]

  • By: krs    latest    Jun 18, 2023 7:38 AM IST
London | లండ‌న్‌లో భారతీయుడికి క‌త్తిపోటు.. మృతి

London |

లండ‌న్‌లో క‌త్తిపోటుకు గురై హైద‌రాబాద్ య‌వ‌తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. శుక్ర‌వారం అక్క‌డ‌ చోటు చేసుకున్న మ‌రో క‌త్తిపోటు ఘ‌ట‌నలో భార‌త సంత‌తి వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌతాంప్ట‌న్ వేలో ఉన్న ఒక నివాస స‌ముదాయంలో ఒక వ్య‌క్తి క‌త్తిపోట్ల‌కు గురై ప‌డి ఉన్న‌ట్లు ఫిర్యాదు రావ‌డంతో పోలీసుల‌కు అక్క‌డ‌కి చేరుకున్నారు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేయ‌గా.. అత‌డి పేరు అర‌వింద్ శ‌శి కుమార్ (38) అని గుర్తించారు.

అయితే కాసేపు చికిత్స‌కు స్పందించిన‌ప్ప‌టికీ త‌ర్వాత ప‌రిస్థితి విషమించ‌డంతో అదేరోజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు లండ‌న్ పోలీసులు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ కేసుకు సంబంధించి స‌ల్మాన్ స‌లీం (25) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామ‌ని, అత‌డిపై హ‌త్య నేరం కింద అభియోగం మోపామ‌ని తెలిపారు.

మ‌రోవైపు ఛాతిలో తీవ్ర‌మైన క‌త్తిపోట్ల‌కు గుర‌వ‌డం వ‌ల్లే అర‌వింద్ చ‌నిపోయిన‌ట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. వ‌రుస‌గా జ‌రుగుతున్న క‌త్తిపోటు ఘ‌ట‌నల్లో గ‌త నెల రోజుల్లో భార‌త సంత‌తికి చెందిన మాల్లే కుమార్‌, తేజ‌స్విని కొంతం ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.