Karimnagar | తమ్ముడికి రాఖీ కట్టేందుకని.. 8 కిలోమీటర్లు నడిచిన అవ్వ

Karimnagar | సోషల్ మీడియాలో వీడియో వైరల్ 80 ఏళ్ల వృద్ధురాలి సోదర ప్రేమ విధాత బ్యూరో, కరీంనగర్: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ. నడిచి వెళ్లిన ఎనభైయ్యేళ్ల వృద్ధురాలి సోదర ప్రేమ ఇది. వృద్ధురాలి పేరు బక్కవ్వ. స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతా పూర్ పరిధిలోని కొత్తపల్లి. పుట్టిల్లు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేదు. రాఖీ పౌర్ణమి నాడు తన […]

Karimnagar | తమ్ముడికి రాఖీ కట్టేందుకని.. 8 కిలోమీటర్లు నడిచిన అవ్వ

Karimnagar |

  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • 80 ఏళ్ల వృద్ధురాలి సోదర ప్రేమ

విధాత బ్యూరో, కరీంనగర్: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ. నడిచి వెళ్లిన ఎనభైయ్యేళ్ల వృద్ధురాలి సోదర ప్రేమ ఇది. వృద్ధురాలి పేరు బక్కవ్వ. స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతా పూర్ పరిధిలోని కొత్తపల్లి. పుట్టిల్లు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేదు.

రాఖీ పౌర్ణమి నాడు తన తమ్ముడు గౌడ మల్లేశంకు రాఖీ కట్టాలనుకుంది. తమ్ముడి ఇంటికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. 8 కి. మీ. మేర ఒక్కతే నడిచి వెళ్లారు. దారిలో ఓ యువకుడు.. ఎటు వెళ్తున్నావంటూ వీడియో తీస్తూ బక్కవ్వను పలకరించాడు. రాఖీ కట్టేందుకు తమ్ముడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి ఆమె ముందుకు సాగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.