Anatsa Trojan | స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలెర్ట్‌..! ఈ యాప్స్‌ను మొబైల్‌ నుంచి డిలీట్‌ చేయండి..! లేకపోతే బ్యాంకు అకౌంట్లు ఖాళీయే..!

Anatsa Trojan | ప్రస్తుతం కాలం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నది. స్మార్ట్‌ ఫోన్‌తో కొన్ని పనులు సులువయ్యాయి. ఏదైనా చిన్న అవసరం ఉన్నా అందరూ ప్లే స్టోర్స్‌ను నుంచి తమకు అవసరమైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఏదిపడితే ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్‌ ఇప్పటికే మాల్‌వేర్‌, వైరస్‌లు, ట్రోజన్స్‌ బారినపడగా.. గూగుల్‌ ఎప్పటికప్పుడు వాటిని […]

Anatsa Trojan | స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలెర్ట్‌..! ఈ యాప్స్‌ను మొబైల్‌ నుంచి డిలీట్‌ చేయండి..! లేకపోతే బ్యాంకు అకౌంట్లు ఖాళీయే..!

Anatsa Trojan | ప్రస్తుతం కాలం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నది. స్మార్ట్‌ ఫోన్‌తో కొన్ని పనులు సులువయ్యాయి. ఏదైనా చిన్న అవసరం ఉన్నా అందరూ ప్లే స్టోర్స్‌ను నుంచి తమకు అవసరమైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఏదిపడితే ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్‌ ఇప్పటికే మాల్‌వేర్‌, వైరస్‌లు, ట్రోజన్స్‌ బారినపడగా.. గూగుల్‌ ఎప్పటికప్పుడు వాటిని డిలీట్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా పలు యాప్స్‌ను సైతం తొలగించింది. సదరు యాప్స్‌లో ప్రమాదకరమైన ట్రోజన్‌ ‘అనాట్సా’ను గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైందని, ఈ ట్రోజన్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు సంబంధించి బ్యాంకింగ్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ సహా పలు వివరాలను తస్కరిస్తున్నట్లు గుర్తించారు.

రెండేళ్ల కిందట ఈ ట్రోజన్‌ను గుర్తించారు.. తాజాగా మరోసారి కనిపించిందని బ్యాకింగ్‌ ట్రోజన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన ట్రోజన్‌ సోకిన యాప్‌ను పెద్ద ఎత్తున యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని.. ప్రపంచవ్యాప్తంగా 600 బ్యాకింగ్‌ యాప్‌లను ఈ ట్రోజన్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

అయితే, గూగుల్‌ ప్లే స్టోర్‌లో పీడీఎఫ్‌ రీడర్‌ పేరుతో అప్‌లోడ్‌ చేశారని, ఆ తర్వాత ట్రోజన్‌ పే లోడ్‌ అప్‌డేట్‌ చేయగా.. వాటిని గుర్తించిన గూగుల్‌ వాటిని తొలగించింది. ఎవరైనా యూజర్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే డిలీట్‌ చేయాలని సూచించింది. అంతకు ముందు 2021 నవంబర్‌లో అనాట్సా ట్రోజన్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో థ్రెట్‌ ఫ్యాబ్రిక్‌ విశ్లేషకులు గుర్తించారు.

పీడీఎఫ్‌ స్కానర్‌, QR కోడ్ స్కానర్‌లు, Adobe Illustrator యాప్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్ పేరుతో ఉన్న యాప్స్‌లో ట్రోజన్స్‌ను కనుగొన్నారు. ట్రోజన్‌ బారినపడ్డ యాప్స్‌ వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లుగా నటిస్తూ డీవైజ్‌ను స్వాధీనం చేసుకొని మోసపూరిత లావాదేవీలు జరుపుతాయని నిపుణులు పేర్కొన్నారు.

తాజాగా PDF Reader – Edit & View PDF, PDF Reader & Editor , All Document Reader & Editor పేరుతో ఉన్న యాప్స్‌ ట్రోజన్‌ బారినపడ్డాయని గూగుల్‌ తెలిపింది. వాటిని యూజర్లు వెంటనే డిలీట్‌ చేయాలని సూచించింది.

బ్యాంకింగ్‌ ట్రోజన్‌ అమెరికాలోని క్యాపిటల్‌ వన్‌, జేపీ మోర్గాన్‌ మొబైల్‌ యాప్‌తో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, దక్షిణ కొరియా, స్వీడన్ మరియు స్విట్జర్లాండ్‌లోని బ్యాంకింగ్ యాప్‌లతో సహా పలు దేశాల్లో సుమారు 600 బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.

వినియోగదారులు బ్యాంకింగ్ యాప్‌ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు, అది వారి స్క్రీన్‌పై ఫిషింగ్ పేజీని చూపించి.. క్రెడిట్‌ కార్డులు, అకౌంట్‌ డీటేయిల్స్‌, లాగిన్ పిన్‌, తదితర వివరాలను దొంగిలించి మరొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తుందని బ్లీపింగ్‌ కంప్యూటర్స్‌ నివేదిక పేర్కొంది.