Gold, Silver price fall| పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. ఇప్పుడు కొనవచ్చా ?

బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. మంగళవారం వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.20,000తగ్గి.. రూ. 2,80,00కు పడిపోయింది. తులం బంగారం తొలుత రూ.1,420 తగ్గినప్పటికి హైదరాబాద్ లో మధ్యాహ్నం కల్లా అనూహ్యంగా రూ. 760 పెరిగి.. రూ.1,53,930కు ఎగబాకి కొనుగోలుదారులను అశ్చర్యపరిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 03, 2026, 2:10 pm IST
Read Time: 4 mins
Gold, Silver price fall| పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. ఇప్పుడు కొనవచ్చా ?

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. మంగళవారం వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.20,000తగ్గి.. రూ. 2,80,00కు పడిపోయింది. జనవరి 29న నమోదైన ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,00నుంచి ఏకంగా రూ.1,45,000 తగ్గడం వెండి ధరల అనూహ్య పతనాన్ని సూచిస్తుంది.

అనూహ్యంగా పెరిగిన బంగారం

మంగళవారం 24క్యారెట్ల బంగారం ధర తొలుత రూ.1,420 తగ్గి రూ.1 51, 750కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,300తగ్గి రూ.1,39,100వద్ద నిలిచింది. జనవరి 29న తులం బంగారం ఆల్ టైమ్ రికార్డు ధర 1,78,850 నుంచి ఐదు రోజుల్లో ఏకంగా రూ. 27,100తగ్గడం గమనార్హం.

అయితే మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ లో అనూహ్యంగా 24క్యారెట్ల 10గ్రాములు బంగారంపై రూ. 760 పెరిగి.. రూ.1,53,930కు ఎగబాకి కొనుగోలుదారులను అశ్చర్యపరిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,41,100కు చేరింది.

ఇప్పుడు కొనవచ్చా…ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతున్న తరుణంలో ఇప్పుడు వాటి కొనుగోలు మంచిదా?..లేక మరింత తగ్గుతుందా..పెరుగుతుందా ? అన్న సందేహాలు కొనుగోలుదారులను పీడిస్తుంది. దీనిపై ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి స్పందిస్తూ… బంగారం, వెండి ధరల తగ్గుదల అవకాశాన్ని సానుకూలంగా చూడాలని, కొనుగోలు చేసే అరుదైన అవకాశంగా చూడాలని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులపై లాభర్జనకు దిగుతున్నందునా.. తాను మరిన్ని కొనుగోలు చేయడానికి నగదుతో సిద్ధంగా ఉన్నానని కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోహాల ధరల తగ్గుదలను నష్ట సంకేతాలుగా కాకుండా.. దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి అవకాశాలుగా చూడాలన్నారు. ముఖ్యంగా వెండి తాత్కాలికంగా తగ్గిన దీర్ఘకాలంలో మళ్లీ పుంజుకుంటుందన్నారు. పారిశ్రామిక లోహంగా వెండికి ఉన్న డిమాండే ఇందుకు కారణం అన్నారు. కరెన్సీల విలువ తగ్గే ప్రమాదం ఉన్నప్పుడు, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.