తగ్గిన బంగారం, వెండి ధరలు

గురువారం దేశీయ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 1,56,110వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 1,43,100వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5000 తగ్గి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 04, 2026, 12:25 pm IST
Read Time: 2 mins
తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం బంగారం, వెండి ధరల అస్థిరతకు కారణమవుతుంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. గురువారం దేశీయ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 1,56,110వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 1,43,100వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5000 తగ్గి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

గత రెండు వారాల కాలంలో డాలర్ బలోపేతం కావడం, రూపాయి బలహీనపడటంతో ఎంసీఎక్స్ (MCX) బంగారం ధర దాదాపు 4 శాతం వరకు పతనమైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగితే అది ద్రవ్యోల్బణాన్ని పెంచి, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల కోత అవకాశాలను మరింత ఆలస్యం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే అమెరికా ఆర్థిక నివేదికలు, వ్యవసాయేతర వేతనాల డేటానే బంగారం ధరల హెచ్చుతగ్గులను నిర్ణయిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.