Site icon vidhaatha

ఆదాయంలో వెంకన్న మరో సెంచరీ

విధాత : తిరుమల శ్రీ వారు వరుసగా మరోసారి 100కోట్ల ఆదాయ మార్కును దాటారు. జనవరి నెలలో దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తద్వారా హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం లభించింది. వరుసగా 23వ నెల కూడా 100కోట్లకు పైగా ఆదాయం సమకూరడం విశేషం. అయితే గత ఏడాది జనవరితో పోల్చితే 7కోట్లు తగ్గింది. హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Exit mobile version