iPhone 15 | ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
iPhone 15| విధాత: అభిమానుల ఊహాగానాలకు తెరదించుతూ ఆపిల్ (Apple) కీలక ప్రకటన చేసింది. ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ను సెప్టెంబరు 15న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఈవెంట్‌ను వీక్షించొచ్చని తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. గత మోడళ్లను ఎప్పుడూ అనుకరించని ఆపిల్.. ఈ సారి కూడా 15 సిరీస్‌ను నిత్య నూతనంగా తీసుకొస్తుందని […]

iPhone 15| విధాత: అభిమానుల ఊహాగానాలకు తెరదించుతూ ఆపిల్ (Apple) కీలక ప్రకటన చేసింది. ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ను సెప్టెంబరు 15న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఈవెంట్‌ను వీక్షించొచ్చని తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
గత మోడళ్లను ఎప్పుడూ అనుకరించని ఆపిల్.. ఈ సారి కూడా 15 సిరీస్‌ను నిత్య నూతనంగా తీసుకొస్తుందని యూజర్లు ఎదురు చూస్తున్నారు. ఐ ఫోన్ 15.. 6.1 అంగుళాల స్క్రీన్, ఐఫోన్ 15 ప్లస్.. 6.7 అంగుళాల స్క్రీన్‌తో రానున్నాయని తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 15 ఆల్ట్రా అనే మోడల్ మరింత పెద్ద సైజుతో వస్తోందని ప్రచారం జరుగుతున్నా..దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
It’s official! Apple will launch the iPhone 15 at the next #AppleEvent on September 12th at 10 a.m. PDT