గ్రేటర్ వరంగల్ బల్దియా బడ్జెట్ ఆమోదం

రూ.612 కోట్ల 29 లక్షల అంచనా బడ్జెట్ రూ.213 కోట్ల 63 లక్షలు పన్నులు రూ.394 కోట్ల 16 లక్షలు గ్రాంట్లు అమలుకు నోచుకొని సీఎం కేసీఆర్ హామీ గ్రాంట్లు లేకుంటే కుంటుపడనున్న అభివృద్ధి వరంగల్ సిటీ పట్ల కేంద్ర, రాష్ట్ర సర్కార్ల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్(Greater warangal) నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ. 612 కోట్ల అంచనాతో రూపొందించినప్పటికీ పెరుగుతున్న జనాభా, నగర అవసరాలకు తగిన స్థాయిలో ఈ నిధులు లేవని పలువురు ఆవేదన […]

గ్రేటర్ వరంగల్ బల్దియా బడ్జెట్ ఆమోదం
  • రూ.612 కోట్ల 29 లక్షల అంచనా బడ్జెట్
  • రూ.213 కోట్ల 63 లక్షలు పన్నులు
  • రూ.394 కోట్ల 16 లక్షలు గ్రాంట్లు
  • అమలుకు నోచుకొని సీఎం కేసీఆర్ హామీ
  • గ్రాంట్లు లేకుంటే కుంటుపడనున్న అభివృద్ధి
  • వరంగల్ సిటీ పట్ల కేంద్ర, రాష్ట్ర సర్కార్ల నిర్లక్ష్యం

గ్రేటర్ వరంగల్(Greater warangal) నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ. 612 కోట్ల అంచనాతో రూపొందించినప్పటికీ పెరుగుతున్న జనాభా, నగర అవసరాలకు తగిన స్థాయిలో ఈ నిధులు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలక సంస్థ పనుల ద్వారా సమకూర్చుకుంటున్నా ఆదాయం రోజువారి కార్యక్రమాలకు పరిమితమవుతుండగా, అభివృద్ధి జరగాలంటే గ్రాంట్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ స్థితిలో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ పెరుగుతోంది. గతంలో సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీ మేరకు రూ. 300 కోట్లు ఏటా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం గ్రాంట్లు పెంచాలని కోరుతున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్(Greater warangal) మున్సిపల్ కార్పోరేషన్‌ వార్షిక బడ్జెట్‌ను (Budjet)ఆమోదించారు. 2023-2024 సంవత్సరానికిగానూ రూ.612 కోట్ల 29 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఈ ముసాయిదా బడ్జెట్ అంచనాలను (MAYAR)మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ హాల్లో జరిగిన పాలక వర్గం ఆమోదించింది.

రూ.612 కోట్ల 29 లక్షల బడ్జెట్

రూ.612 కోట్ల 29 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.213 కోట్ల 63 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

గ్రాంట్లు (Grants)రాకుంటే అభివృద్ధి కుంటుపడినట్టే

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పన్నులు విధించడం అనేది స్థానిక పాలకవర్గం చేతిలో ఉన్నందున ఈ విషయంలో సమస్యరాకపోచ్చు. నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూల్లు చేపట్టడమే అధికారులు, సిబ్బంది మీద ఉంటుంది. కానీ అనుకున్న అంచనా మేరకు గ్రాంట్లు రాకపోతే నగరాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (Employees)ఉద్యోగుల జీతభత్యాలు, రోజువారీ నిర్వహణకే సరిపోతుంది ఈ స్థితిలో నగరాభివృద్ధి జరగాలంటే అదనపు నిధులు తప్పక అవసరం. ఇతరత్రా నీటి పన్ను ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలు వరంగల్ కార్పొరేషన్ ఇప్పటికీ సాధించుకోలేకపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో గ్రాంట్లు లేకపోతే అభివృద్ధి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.

అమలుకాని రూ. 300 కోట్ల హామీ

ఇప్పటికే ముఖ్యమంత్రి (CM)కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా రూ. 300 కోట్ల నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. ఒకటి, రెండు సంవత్సరాలు నిధులు కేటాయించినప్పటికీ ఆ తర్వాత ఈ విషయాన్ని విస్మరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం అమలుకు నోచుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

వరంగల్(WARANGAL) పట్ల రాష్ట్ర సర్కారు వివక్ష

హైదరాబాద్ తర్వాత తెలంగాణ లో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శలు ఉన్నాయి. ఆకస్మికంగా ఏ పెద్ద సమస్య ఎదురైనా నగరం అల్లకల్లోలమై ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రెండేళ్ల క్రితం సంభవించిన భారీ వర్షాలతో నగరంలోని మెజారిటీ కాలనీలో నీట మునిగి అవస్థల పాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈ కారణంగానే వరంగల్ పై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత శ్రద్ధ అవసరమని భావిస్తున్నారు. పాలకవర్గం కూడా ఈ దిశగా ప్రయత్నించాల్సి ఉన్నప్పటికీ తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిలో పాలకవర్గం లేకపోవడం, ప్రతిపక్షానికి ఆ బలం లేకపోవడంతో సమస్య చర్చకు రావడం లేదనే అభిప్రాయం ఉంది. కేంద్రం కూడా వరంగల్ లాంటి నగరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు.

వాటా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం

ఈ నేపథ్యంలో బడ్జెట్లో మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లే ఇందులో ప్రధానం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా వివిధ పథకాల కింద కేంద్రం విడుదల చేస్తున్న గ్రాంట్లను వరంగల్ నగర పాలక సంస్థ పారదర్శకంగా వినియోగించడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర నిధుల నిష్పత్తిలో రాష్ట్ర నిధులు కూడా కేటాయించాల్సి ఉండగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం (State government) తమ వాటా చెల్లించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.

దీంతో అధికారులు గ్రాంట్ల విషయంలో కేంద్రానికి జవాబు చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. వరంగల్ నగరపాలక సంస్థ పాలకవర్గం కూడా గులాబీ పార్టీకి చెందినదే కావడంతో సానుకూలంగా స్పందించి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏటా రూ.300 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కౌన్సిల్ సమావేశంలో (Council meeting) ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ,జిడబ్లూఎంసి కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమిమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు పాల్గొన్నారు.