Ashwin | తండ్రి, కొడుకుల‌ని ఔట్ చేసిన ఘ‌న‌త సాధించిన అశ్విన్.. ఆ తండ్రి, కొడుకులెవ‌రంటే..!

Ashwin: ప్ర‌స్తుతం భార‌త్- విండీస్ మ‌ధ్య తొలి టెస్ట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. డొమినికా వేదికగా ప్రారంభ‌మైన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సొంత గ‌డ్డ‌పై విండీస్ కనీసం 300 ప‌రుగులు అయిన సాధించి భార‌త్‌కి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అనుకున్నారు. కాని భారత బౌలర్ల ప‌దునైన బంతుల‌కి విండీస్ జట్టు విలవిలాడింది. కేవలం 150 పరుగులకే కుప్ప‌కూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 […]

  • By: sn    latest    Jul 13, 2023 8:37 AM IST
Ashwin | తండ్రి, కొడుకుల‌ని ఔట్ చేసిన ఘ‌న‌త సాధించిన అశ్విన్.. ఆ తండ్రి, కొడుకులెవ‌రంటే..!

Ashwin: ప్ర‌స్తుతం భార‌త్- విండీస్ మ‌ధ్య తొలి టెస్ట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. డొమినికా వేదికగా ప్రారంభ‌మైన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సొంత గ‌డ్డ‌పై విండీస్ కనీసం 300 ప‌రుగులు అయిన సాధించి భార‌త్‌కి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అనుకున్నారు. కాని భారత బౌలర్ల ప‌దునైన బంతుల‌కి విండీస్ జట్టు విలవిలాడింది. కేవలం 150 పరుగులకే కుప్ప‌కూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్ ప‌లు ఘ‌న‌త‌ల‌ని సాధించాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో తండ్రీకొడుకులను ఔట్ చేసిన రికార్డు కూడా అశ్విన్ ఖాతాలో వ‌చ్చి చేరింది.

విండీస్‌ ఓపెన‌ర్ తాగ్‌నారాయణ్ చంద్రపాల్ ను అశ్విన్ బౌల్డ్ చేయ‌డం ద్వారా త‌నపేరిట అరుదైన రికార్డ్ న‌మోదు చేసుకున్నాడు. 12 ఏళ్ల కిందట న్యూఢిల్లీలో జ‌రిగిన త‌న తొలి టెస్టు మ్యాచ్‌లో సీనియర్ చంద్రపాల్ ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో తండ్రి, కొడుకుల‌ని ఔట్ చేసిన ఘ‌న‌త అశ్విన్ ఖాతాలో వచ్చి చేరింది. కాగా, తాగ్‌నారాయణ్ చంద్రపాల్.. శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే టెస్ట్ క్రికెట్ లో ఇలా ఒకే బౌలర్ తండ్రీకొడులను ఔట్ చేసిన సందర్భాలు ఐదు ఉండ‌గా, అందులో మూడుసార్లు ఈ సీనియర్, జూనియర్ చంద్రపాల్‌ల వికెట్లే ఆయా బౌలర్లు తీశారు.

అశ్విన్ క‌న్నా ముందు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, సౌతాఫ్రికా స్పిన్నర్ సిమోన్ హార్మర్ ఈ తండ్రీ కొడుకులను ఔట్ చేసిన ఘనత ద‌క్కించుకున్నారు. ఇక న్యూజిలాండ్ కు చెందిన తండ్రీ కొడుకులు లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ లను ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ , పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టెస్ట్ క్రికెట్‌లో ఔట్ చేశారు. కాగా, సీనియ‌ర్ చంద్ర‌పాల్ త‌న‌యుడు గ‌త ఏడాదే టెస్ట్ క్రికెట్ ప్రారంభించ‌గా, ఆయ‌న కూడా తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకోవాల‌ని భావిస్తున్నాడు. 1994లో తన టెస్ట్ కెరీర్ మొదలుపెట్టిన చంద్రపాల్.. 2015 వరకూ ఆడి తప్పుకున్నారు.