Assam CM | గాంధీ పేరుతో మహాత్ములు కాలేరు.. ఇండియా కూటమిపై అస్సాం సీఎం హిమంత విసుర్లు
Assam CM | విధాత: గాంధీ పేరు పెట్టుకున్న వారంతా గాంధీ కాలేరంటూ అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలువాలని ఆశిస్తుందని విమర్శించారు. ఇండియా పేరుతో వారు ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నేను రేపు మహాత్మగాంధీ పేరు పెట్టుకుంటే నేను మహాత్మగాంధీ కాలేనని, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకుంటే బోస్‌ను కాలేనన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేసిన డీఎంకే […]

Assam CM |
విధాత: గాంధీ పేరు పెట్టుకున్న వారంతా గాంధీ కాలేరంటూ అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలువాలని ఆశిస్తుందని విమర్శించారు.
ఇండియా పేరుతో వారు ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నేను రేపు మహాత్మగాంధీ పేరు పెట్టుకుంటే నేను మహాత్మగాంధీ కాలేనని, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకుంటే బోస్‌ను కాలేనన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేసిన డీఎంకే పార్టీని ఇండియా కూటమి నుంచి రాహుల్‌గాంధీ ఎందుకు బహిష్కరించడం లేదన్నారు.
ఇండియా కూటమి పలు చానెళ్ల యాంకర్లను బహిష్కరించడం పిల్ల చేష్ట అన్నారు. కాంగ్రెస్ మీడియాపై ఆంక్షలు పెట్టడం కొత్తేమి కాదని గతంలోనూ ఎమర్జన్సీ సమయంలో చేసిందన్నారు. సరైన సమయంలో ఇస్రో చంద్రయాన్ 3విజయవంతం చేసిందని, చంద్రునిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేను కాంగ్రెస్ పార్టీని చంద్రునిపైకి పంపుతానన్నారు.