Assam | ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..

Assam విధాత‌: వారు వీర‌ని లేకుండా ఇప్పుడు అంద‌రూ ఫ్యామిలీ వ్లాగ్‌ (Vlog)ల‌ను చేస్తున్నారు. ఆ వీడియోల్లో త‌మ ఇల్లు. కారు, భార్య, భ‌ర్త‌తో పాటు వారి పిల్ల‌ల‌నూ భాగం చేస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో చిన్న పిల్ల‌ల‌ను చూపించడంపై ఈ మ‌ధ్య కాలంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా అస్సాం (Assam) పోలీస్ ఈ పోక‌డ‌పై వినూత్నంగా త‌ల్లిదండ్రుల‌ను హెచ్చరించారు. కృత్రిమ మేధ సాయంతో చిన్న పిల్ల‌ల ఫొటోలు రూపొందించి త‌మ‌ను వీడియోల్లో చూపించొద్ద‌ని వారితో చెప్పిస్తున్నట్లు […]

Assam | ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..

Assam

విధాత‌: వారు వీర‌ని లేకుండా ఇప్పుడు అంద‌రూ ఫ్యామిలీ వ్లాగ్‌ (Vlog)ల‌ను చేస్తున్నారు. ఆ వీడియోల్లో త‌మ ఇల్లు. కారు, భార్య, భ‌ర్త‌తో పాటు వారి పిల్ల‌ల‌నూ భాగం చేస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో చిన్న పిల్ల‌ల‌ను చూపించడంపై ఈ మ‌ధ్య కాలంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా అస్సాం (Assam) పోలీస్ ఈ పోక‌డ‌పై వినూత్నంగా త‌ల్లిదండ్రుల‌ను హెచ్చరించారు. కృత్రిమ మేధ సాయంతో చిన్న పిల్ల‌ల ఫొటోలు రూపొందించి త‌మ‌ను వీడియోల్లో చూపించొద్ద‌ని వారితో చెప్పిస్తున్నట్లు ఫొటోలు వీడియోలు విడుద‌ల చేశారు.

లైక్స్ పోతాయి.. కానీ డిజిట‌ల్ గాయాలు మానిపోవు. షేరింగ్ వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాల నుంచి మీ బిడ్డ‌ల‌ను ర‌క్షించుకోండి. దీనిపై కాస్త స్పృహ‌తో ఉండండి అని వ్యాఖ్యను జోడించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అస్సాం పోలీసుల‌పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

‘నేను ఒప్పుకొంటున్నా.. ఇంత సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించినందుకు ధ‌న్య‌వాదాలు’ అని ఒక‌రు ట్వీట్ చేశారు. ‘చిన్న‌పిల్ల‌ల‌కు ఊహ తెలియ‌కుండా వారిని వీడియోలో పెట్ట‌డం గోప్య‌త‌కు భంగ‌మే. వారు త‌మ‌పిల్ల‌ల బాల్యాన్ని నాశ‌నం చేస్తున్నారు’ అని మ‌రొక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.