Assembly | రేపటి నుంచి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Assembly | విధాత: అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలన్న భావనలో సభ్యులన్నారు. ఈ సమావేశాల్లో వరదలపై పట్టుబట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిన విషయం అందరికి తెలిసిందే. మోరంచపల్లి సర్వస్వం కోల్పోయింది. ఇలా పలు గ్రామాలు ఈ వరదలకు పూర్తిగా ముగినిపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయారు. వరంగల్ త్రి […]
Assembly |
విధాత: అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలన్న భావనలో సభ్యులన్నారు. ఈ సమావేశాల్లో వరదలపై పట్టుబట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిన విషయం అందరికి తెలిసిందే.
మోరంచపల్లి సర్వస్వం కోల్పోయింది. ఇలా పలు గ్రామాలు ఈ వరదలకు పూర్తిగా ముగినిపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయారు. వరంగల్ త్రి సిటీలో మెజార్టీ కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వాగులు, నదుల వెంట ఉన్న పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది. ఇలా వరదల్లో నష్ట పోయిన ప్రజలు, రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చే యనున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్టేట్‌మెంట్ ఇవ్వాలని పట్టు బట్టాలని భావిస్తోంది.
గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. బీఏసీ తీసుకున్ననిర్ణయం ప్రకారం సభ జరుగుతుంది. అయితే ఈ సమావేశాలు తప్పని సరిగా ఆగస్టు 11వ తేదీలోగా నిర్వహించాలి.. అలా నిర్వహించక పోతే రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నదన్నఅభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
సభను ధీర్ఘకాలం కాకుండా స్వల్ప కాలం మాత్రమే నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతున్నది. అయితే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి సభను మరిన్ని రోజులు నడపాలని కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం ఉంది.
ఈ అసెంబ్లీలో సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వం పరం చేసే కీలకమైన బిల్లుతో పాటు గవర్నర్ వెనక్కు పంపిన బిల్లులను ప్రభుత్వం తిరిగి సభ ఆమోదం పొందనున్నది. వీటితో పాటు టిమ్స్‌పైన, నిమ్స్ విస్తరణపైన చర్చ జరిగే అవకాశం ఉంది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram