Creative Love Story | ‘నాగుపాము’ సాక్షిగా చిగురించిన ‘ప్రేమ‌’.. దానితో ప్రీ వెడ్డింగ్ షూట్.. ఫోటోలు వైర‌ల్

Creative Love Story | పెళ్లి అన‌గానే ప్రీ వెడ్డింగ్ షూట్ గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కొత్త‌ద‌నం ఉండాల‌ని ప్ర‌తి జంట కోరుకుంటోంది. అందుకేనేమో ఈ జంట వినూత్నంగా ఆలోచించింది. ఏకంగా నాగుపాముతోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింద‌నే విష‌యాన్ని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. వివేక్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఆ ప్రేమ జంట స్టోరీని ఫోటోల […]

Creative Love Story | ‘నాగుపాము’ సాక్షిగా చిగురించిన ‘ప్రేమ‌’.. దానితో ప్రీ వెడ్డింగ్ షూట్.. ఫోటోలు వైర‌ల్

Creative Love Story | పెళ్లి అన‌గానే ప్రీ వెడ్డింగ్ షూట్ గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కొత్త‌ద‌నం ఉండాల‌ని ప్ర‌తి జంట కోరుకుంటోంది. అందుకేనేమో ఈ జంట వినూత్నంగా ఆలోచించింది. ఏకంగా నాగుపాముతోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింద‌నే విష‌యాన్ని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

వివేక్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఆ ప్రేమ జంట స్టోరీని ఫోటోల రూపంలో నెటిజ‌న్ల‌కు వివ‌రించాడు. మ‌రి మ‌నం కూడా ఆ ప్రేమికుల క్రియేటివిటీ ప్రేమ‌క‌థ‌పై లుక్కేద్దాం..

ఓ యువ‌తి త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోని పెర‌ట్లోకి వ‌స్తుండ‌గా.. బుస‌లు కొడుతున్న నాగుపాము క‌నిపిస్తుంది. దాంతో వెంట‌నే పాములు ప‌ట్టే వ్య‌క్తికి ఫోన్‌లో స‌మాచారం ఇస్తుంది. ఇంకేముంది ఆ స్నేక్ క్యాచ‌ర్ కూడా క్ష‌ణాల్లోనే ఆ ఇంటి వ‌ద్ద వాలిపోయి ఇంటి పెర‌ట్లో ఉన్న నాగుపామును త‌న‌దైన స్టైల్లో ప‌ట్టేసి.. ఆ యువ‌తిని ప్రేమ‌లో ప‌డేస్తాడు.

Snake | నాగుపాము కాటు నుంచి తృటిలో త‌ప్పించుకున్న చిన్నారి

అనంత‌రం స్నేక్ క్యాచ‌ర్ ఆ పామును ఓ డ‌బ్బాలో వేసి త‌న ఫ్రెండ్‌తో క‌లిసి యాక్టివాపై వెళ్తూ.. ఆమెకు బైబై చెబుతూ.. ఫోన్ కాల్ చేయాల‌ని సైగ చేస్తాడు స్నేక్ క్యాచ‌ర్. ఆ యువ‌తి కూడా అత‌ని స్టైల్‌కు ఫిదా అయిపోయి.. ఫోన్ చేస్తుంది. అలా ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు.

ఇద్ద‌రి మ‌న‌షులు క‌లియ‌డంతో.. నాగుపాము సాక్షిగా ఆ జంట ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేస్తుంది. అయితే చివ‌ర‌గా నాగుపాము బుసలు కొడుతూ ప‌డ‌గ విప్పి ఉండ‌గా.. ఆ జంట ఒక‌రి చేయి మ‌రొక‌రు ప‌ట్టుకుని ముందుకు న‌డుస్తున్న దృశ్యాన్ని క్రియేటివ్‌గా చిత్రీక‌రించారు.

ఇక ఈ ఫోటో షూట్‌పై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందించారు. ఈ ప్రేమికుల వినూత్న ఆలోచ‌న బాగానే ఉంది కానీ.. పామును ఇబ్బంది పెట్ట‌డం స‌రైంది కాద‌ని క్లాస్ పీకారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మూవీస్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ చేయొచ్చ‌ని మ‌రో నెటిజ‌న్ స్పందించాడు.