Bride Rides Sports Bike | పెళ్లి మండపానికి స్పోర్ట్స్ బైక్ పై వధువు..వైరల్ వీడియో
పెళ్లి మండపానికి స్పోర్ట్స్ బైక్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన వధువు వీడియో వైరల్ అయ్యింది. 3 మిలియన్ల వీక్షణలు దాటిన ఈ క్లిప్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
విధాత : ఆధునిక కాలంలో యువతీ యువకులు తమ పెళ్లిళ్లలో ఏదో ప్రత్యేకత ఉండాలన్న అభిరుచిని కనబరుస్తున్నారు. దీంతో వివాహ శుభకార్యాల ఆహ్వాన పత్రాలలో..కల్యాణ మండపాలలో..పెళ్లి వేడుకలలో ఏదో ఒక ప్రత్యేకత కోసం తాపత్రాయపడుతున్నారు. తాజాగా ఓ యువతి పెళ్లి మండపానికి ఏకంగా స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా వధూవరులు పెళ్లి దుస్తులను ధరించాక ఇంటి నుండి బయటకు అడుగు పెట్టరు. నేరుగా కల్యాణ మండపానికే చేరుకుంటారు. కానీ ఓ యువతి పెళ్లి దుస్తులలో రోడ్డుపై వేగంగా స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియోలోపెళ్లికూతురు పెళ్లి దుస్తులను ధరించిన యువతి రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ నడుపుకుంటూ వెళ్లిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు ఆమెను చూసి ఆశ్చర్యపోతునే..ఆమె సాహసాన్ని అభినందిస్తూ హాట్సాప్ చెప్పారు. పెళ్లికూతురు మాత్రం వారందరి అభినందనలను కంటి చూపుతోనే స్వీకరిస్తూ…వేగంగా బైక్ నడుపుకుంటూ తను వెళ్లాల్సిన కల్యాణ మండపానికి రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వీక్షించడం విశేషం. అయితే ఈ వీడియో 2024ఆక్టోబర్ లో తీసిందని..అయినా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం విశేషం అని నెటిజన్లు చెబుతున్నారు.
పెళ్లి దుస్తుల్లో రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ నడిపిన వధువు.. వీడియో వైరల్ pic.twitter.com/wQgvGlZA6c
— ChotaNews App (@ChotaNewsApp) November 22, 2025
ఇవి కూడా చదవండి :
Principal Warning | ‘చంపి పడేస్తా’.. విద్యార్థికి ప్రిన్సిపాల్ వార్నింగ్
Shiva Jyothi | ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి వివాదాలు తగునా.. తీన్మార్ సావిత్రిపై భక్తుల ఆగ్రహం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram