Father wears QR Code | క‌ట్నాల‌కు ‘క్యూఆర్’ కోడ్.. అథితుల దృష్టిని ఆక‌ర్షించిన పెళ్లి కుమార్తె తండ్రి

Father wears QR Code | పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తుంటారు. అలాంటి పెళ్లి( Marriage )ని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు. జీవితాంతం గుర్తుండి పోయే విధంగా పెళ్లి వేడుక‌ను నిర్వ‌హిస్తారు. ఈ పెళ్లి వేడుక‌లో మాత్రం వ‌ధువు తండ్రి( Bride Father ) చేసిన వినూత్న ఆలోచ‌న‌.. అతిథుల‌కు( Guests ) జీవితాంతం గుర్తుండి పోతుంది. ఎందుకంటే ఈ తండ్రి క‌ట్నాల కోసం క్యూఆర్ కోడ్( QR Code ) ఏర్పాటు చేశాడు. అది కూడా ఆ కోడ్‌ను త‌న జేబుకు త‌గిలించుకుని, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

  • By: raj |    national |    Published on : Nov 01, 2025 7:24 AM IST
Father wears QR Code | క‌ట్నాల‌కు ‘క్యూఆర్’ కోడ్.. అథితుల దృష్టిని ఆక‌ర్షించిన పెళ్లి కుమార్తె తండ్రి

Father wears QR Code | అది కేర‌ళ( Kerala ) రాష్ట్రం.. ఓ పెళ్లి మండ‌పం విద్యుత్ దీపాల‌తో మెరిసిపోతోంది. పుష్పాలంక‌ర‌ణ మైమ‌రిపిస్తోంది. భాజాభ‌జంత్రీలు మోగుతున్నాయి. అతిథుల‌తో( Guests ) సందడిగా మారిపోయింది. ఇక వ‌రుడు( Bride Groom ) వ‌ధువు( Bride ) మెడ‌లో మూడు ముళ్లు వేయ‌గా.. బంధువులు, అథితులు ఆ కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

ఇక క‌ట్నాలు స‌మ‌ర్పించేందుకు బంధువులు, అతిథులు సిద్ధ‌మ‌య్యారు. సాధార‌ణంగా ఎవ‌రో ఒక వ్య‌క్తి వ‌ధువు త‌ర‌పున‌, మ‌రో వ్య‌క్తి వ‌రుడి త‌ర‌పున క‌ట్నాలు స్వీక‌రిస్తాం. కానీ ఈ పెళ్లి వేడుక‌లో మాత్రం వ‌ధువు తండ్రి( Bride Father ) వినూత్నంగా ఆలోచించాడు. డిజిట‌ల్ యుగాన్ని అందిపుచ్చుకున్నాడు. క‌ట్నాల కోసం ఏకంగా ఓ క్యూఆర్ కోడ్‌( QR Code )ను ఏర్పాటు చేశాడు. ఇక దాన్ని త‌న జేబుకు త‌గిలించుకుని అథితుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. క‌ట్నాలు స‌మ‌ర్పించాల‌నుకునే వారు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించొచ్చ‌నే సందేశాన్ని బంధువుల‌కు, అతిథుల‌కు ఇచ్చాడు వ‌ధువు తండ్రి. ఇంకేముంది అథితులంతా ఆ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి త‌మ‌కు తోచినంత క‌ట్నాలు స‌మ‌ర్పించారు. తండ్రి స్మార్ట్ వ‌ర్క్‌కు అంద‌రు ఫిదా అయిపోయారు. ఈ క‌ట్నాల స్వీక‌ర‌ణ‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను అక్టోబ‌ర్ 29వ తేదీన షేర్ చేశారు. 1.9 మిలియ‌న్ల మంది వీక్షించారు. వేల మంది త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేశారు. వ‌ధువు తండ్రి వినూత్న ఆలోచ‌న అద్భుత‌మ‌ని ప‌లువురు నెటిజ‌న్లు కొనియాడారు. ఇలాంటి వేడుక‌ల్లో స్మార్ట్‌గా సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం గొప్ప విష‌యమ‌ని కితాబిస్తున్నారు. 100 శాతం అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంలో ఇలాంటి క్రియేటివిటి సాధార‌ణ‌మే అని మ‌రొక‌రు పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by INDIA ON FEED (@indiaonfeed)